పెరమానళ్లూరులో తాగునీరు కలుషితం | Sakshi
Sakshi News home page

పెరమానళ్లూరులో తాగునీరు కలుషితం

Published Mon, May 27 2024 6:20 PM

పెరమా

పళ్లిపట్టు: తాగునీటిలో మురుగునీరు కలుషితం కావడంతో గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పళ్లిపట్టు సమీపం పెరమానళ్లూరు గ్రామ పంచాయతీలోని దళితవాడలో 180 కుటుంబీకులు నివాసముంటున్నారు. పంచాయతీ ద్వారా గ్రామస్తులకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో మురుగునీటి సమీపంలోని తాగునీటి పైపులైన్‌ లీకేజీ ఏర్పడి తాగునీటిలో మురుగునీరు కలుషితం కావడంతో ఆ నీటిని తాగిన గ్రామస్తులకు శనివారం వాంతులు, విరేచనాలు చోటుచేకున్నాయి. దీంతో చిన్నారులు సహా ఏడుగురిని 108 ఆంబులెన్స్‌ ద్వారా తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో అనుమతించి చికిత్స పొందారు. దీంతో స్పందించిన పంచాయతీ రాజ్‌ శాఖతో పాటు ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం గ్రామంలో పర్యటించి వెంటనే తాగునీటి సరఫరా నిలిపివేశారు. పైపులైన్లు కొత్తగా ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నారు. అదే సమయంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ ధనుంజయన్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గ్రామస్తులకు వైద్య పరీక్షలతోపాటు మందులు పంపిణీ చేశారు.

గ్రామీణులకు వాంతులు, విరేచనాలు

ఆసుపత్రికి 8 మంది తరలింపు

పెరమానళ్లూరులో తాగునీరు కలుషితం
1/1

పెరమానళ్లూరులో తాగునీరు కలుషితం

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement