విద్యార్థులతో పనులు చేయించొద్దు - | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో పనులు చేయించొద్దు

Published Mon, May 27 2024 6:10 PM

-

కొరుక్కుపేట: పాఠశాలల్లో సంక్షేమ సామగ్రి అందించేందుకు విద్యార్థులను ఉపయోగించరాదని, అంతేకాకుండా అందజేసే వస్తువుల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. వేసవి సెలవుల అనంతరం వచ్చే నెల(జూన్‌) 6వ తేదీన పాఠశాలలు తెరవనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజు నుంచే విద్యార్థులకు సంక్షేమ సామగ్రి అందించేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు దశల్లో విద్యార్థులకు సంక్షేమ సామగ్రి అందించబోతున్నట్లు విద్యాశాఖ తెలియజేసింది. దీని ప్రకారం పాఠశాలలు తెరిచిన తొలిరోజు నుంచే పాఠ్యపుస్తకాలు, నోట్లు, భౌగోళిక మ్యాప్‌, రెండో దశలో విద్యా పరికరాల పెట్టె, చెప్పులు, యూనిఫాం తదితర సంక్షేమ సామగ్రి అందించాలని యోచిస్తున్నారు. జూలై 15లోగా అందించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సంక్షేమ సామగ్రి అందించే పనిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులు విద్యార్థులను వినియోగించుకోవద్దని పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక విద్యాశాఖాధికారులకు సూచించింది. అంతే కాకుండా విద్యార్థులకు అందించిన మెటీరియల్‌ వివరాలను ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ ఏజెన్సీ(ఈఎంఐఎస్‌) వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని, ఆ వివరాలను తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌ నంబర్‌లకు మెసేజ్‌లుగా పంపాలని విద్యాశాఖ ఆదేశించింది. కాబట్టి ఉపాధ్యాయులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరింది.

Advertisement
 
Advertisement
 
Advertisement