కారు ఢీకొని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి మృతి

Published Thu, Oct 5 2023 2:08 AM

-

అన్నానగర్‌: రామనాథపురం జిల్లా రామేశ్వరం తంగచ్చిమఠం రాజీవ్‌గాంధీ నగర్‌ ప్రాంతానికి చెందిన ఎడ్మండ్‌ (50). తంగచ్చిమఠం నుంచి బుధవారం వేకువజామున దర్గా బస్టాండ్‌ సమీపంలోని టీ తాగేందుకు బైకుపై వెళ్లాడు. ఆ సమయంలో తిరువారూరు నుంచి రామేశ్వరం వైపు వస్తున్న కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎడ్మండ్‌ తీవ్రంగా గాయపడి మరణించాడు. తంగచ్చిమఠం పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్‌ సయ్యద్‌ను అరెస్టు చేశారు.

మేసీ్త్ర దారుణ హత్య

అన్నానగర్‌: కన్యాకుమారి జిల్లా తక్కలై సమీపం కులిక్కోడు వయల్‌క్కరై ప్రాంతానికి చెందిన రెజిన్‌ (32) మేస్త్రీ. ఇతని స్నేహితుడు రాజేష్‌ (31). మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇద్దరూ సిట్రట్టువిలై ప్రాంతంలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో కారులో వచ్చిన ఆరుగురు సభ్యుల ముఠా రెజిన్‌, రాజేష్‌పై కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో ఇద్దరూ కుప్పకూలిపోయారు. అనంతరం ఆ ముఠా కారులో వెళ్లిపోయింది. వారిని స్థానికులు రక్షించి ఆచారిపల్లం ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అప్పటికే రెజిన్‌ మృతి చెందినట్లు వెల్లడించారు. రాజేష్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తక్కలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వినీత్‌ (24), భరత్‌ లియోన్‌ (23), 17 ఏళ్ల బాలుడు, అరుణ్‌ (23), జెబిన్‌ (24), విజీస్‌ (24) అనే ఆరుగురుని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement