మూడో విడతకు ఏర్పాట్లు చేసుకోవాలి : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్లతో శనివారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వెబెక్స్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు చూసుకోవాలన్నారు. పోలింగ్ తర్వాత ఓట్లు లెక్కింపు ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్‌డీఓ వీవీ.అప్పారావు, డివిజనల్ ప్రిసైడింగ్ అధికారి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


