ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తాం

Dec 7 2025 7:27 AM | Updated on Dec 7 2025 7:27 AM

ఎస్‌ఎ

ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తాం

దేవరకొండ, కొండమల్లేపల్లి : ‘నల్లగొండ జిల్లా అంటేనే చైతన్యం.. నిజాం పాలనకు చరమగీతం పాడింది ఈ జిల్లానే. గత పాలకులు జిల్లా ప్రజలపై కక్షగట్టి శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) పనులను పక్కన బెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాం’ అని ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాలు’ సభలో ప్రసంగించారు. రెండేళ్ల క్రితం ఓటు అనే ఆయుధంతో గడీల పాలన బద్దలు కొట్టి ప్రజలు ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సమర్థులను.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వారినే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు చేపట్టలేదని, ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రాగా నే టన్నెల్‌ పనులకు నిధులు కేటాయించామన్నారు. రాబోయే రెండేళ్లలో దేవరకొండ నియోజకవర్గ పరి ధిలోని పెండింగ్‌ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్నారు. ఎమ్మెల్యే బాలునా యక్‌ చొరవతో ఒక్క దేవరకొండ నియోజకవర్గానికే అత్యధికంగా 14వేల రేషన్‌కార్డులు మంజూరయ్యాయనితెలిపారు. దేవరకొండకు నర్సింగ్‌ కాలేజీ మంజూరు చేస్తామని, అందుకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచిస్తామన్నారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులలు మంజూరు చేస్తామని, దేవరకొండలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.5కోట్లు కావాలని ఎమ్మెల్యే బాలునాయక్‌ అడగగా.. రూ.6 కోట్ల మంజూరు చేయిస్తానన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక దేవరకొండ ప్రాంతానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌, సీతక్కను పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. మద్దిమడుగులో గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.20 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మహిళా సంఘాలకు రూ.11.33కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్‌ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్‌, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌, గుత్తా అమిత్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్‌, మాధవరెడ్డి, వేణుధర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, యూనూస్‌, ఏవిరెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, మాధవరెడ్డి, దూదిపాళ్ల రేఖ, దేవేందర్‌, ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ అంటే.. చైతన్యానికి ప్రతీక

ఫ మంత్రులను పంపి సమీక్షలు నిర్వహిస్తాం

ఫ పంచాయతీ ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవాలి

ఫ దేవరకొండలో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం

ఫ ‘ప్రజాపాలన విజయోత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఫ సభకు భారీగా తరలివచ్చిన జనం

ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తాం1
1/1

ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement