సర్పంచ్ పదవులకు 1,052.. వార్డు స్థానాలకు 3,493
మూడో విడత నామినేషన్ల వివరాలు
ఫ మూడో విడత పంచాయతీ పోరుకు భారీగా నామినేషన్లు
ఫ హుజూర్‌నగర్ డివిజన్‌లో శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో చివరి రోజు నామినేషన్ల స్వీకరణ శుక్రవారం అర్ధరాత్రి ముగిసింది. ఈ నెల 3వ తేదీనుంచి డివిజన్‌లోని ఏడు మండలాల పరిధిలో 146 గ్రామ పంచాయతీలు, 1,318 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు సర్పంచ్‌కు 107 నామినేషన్లు, వార్డు సభ్యులకు 116 నామినేషన్లు వచ్చాయి. ఇక రెండోరోజు సర్పంచ్‌కు 196, వార్డు సభ్యులకు 589 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు క్లస్టర్ల సెంటర్లకు అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూలైన్లలో నిల్చున్నారు. దీంతో సాయంత్రం 5.30గంటల వరకు లైన్‌లో ఉన్న ఆశావహులకు టోకెన్లు జారీచేసి రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు సర్పంచ్ పదవులకు 749, వార్డులకు 2,788 నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు గరిడేపల్లి మండలం నుంచి దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.
మండలం జీపీలు వార్డులు సర్పంచ్ వార్డు
నామినేషన్లు నామినేషన్లు
చింతలపాలెం 16 148 113 422
గరిడేపల్లి 33 300 228 785
హుజూర్‌నగర్ 11 110 76 323
మఠంపల్లి 29 254 255 775
మేళ్లచెరువు 16 152 82 356
నేరేడుచర్ల 19 168 132 365
పాలకవీడు 22 186 166 467


