హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి
సూర్యాపేట టౌన్ : శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు వెలకట్టలేనివని ఎస్పీ నరసింహ అన్నారు. హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్‌కు ఎస్పీ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాపోటీలు, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. హోంగార్డు ఆఫీసర్స్ సంక్షేమానికి ఎంతగానో కృషిచేస్తున్నామన్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డు ఆఫీసర్స్‌కు ప్రశంసా పత్రాల అందించి అభినందించారు. కార్యక్రమంలో ఆర్ముడ్ ఏఎస్పీ జనార్దన్‌రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం, హోంగార్డు ఇన్‌చార్జి, ఆర్‌ఎస్‌ఐ అశోక్, ఇతర ఆర్‌ఎస్‌ఐలు సురేష్, సాయిరాం, రాజశేఖర్ పాల్గొన్నారు.


