మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) పాత్ర చాలా కీలకమైందని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు జి.రవినాయక్ అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో సూక్ష్మ పరిశీలకులు, జోనల్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఒకరోజు ముందుగానే మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ స్టేషన్‌కు చేరుకుని పరిశీలించాలన్నారు. అలాగే జోనల్ అధికారులు 7, 8 గ్రామ పంచాయతీలకు ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేర్చేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ఏమైనా పోలింగ్ మెటీరియల్ కావాలన్నా, సిబ్బందికి భోజనాలు చూసే బాధ్యత జోనల్ అధికారులదేన న్నారు. అనంతరం కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు బాధ్యతగా పనిచేయాలన్నారు. శిక్షణలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్‌డీఓ వీవీ.అప్పారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్, ట్రైనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్


