రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ కృషి శ్లాఘనీయం
సూర్యాపేట టౌన్ : భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి శ్లాఘనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కొనియాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఎమ్మార్పీఎస్, ఇతర సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఖమ్మం క్రాస్ రోడ్‌లో గల అంబేద్కర్ విగ్రహానికి జగదీష్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు యాతాకుల రాజన్న మాదిగ, చిన్న శ్రీరాములు మాదిగ, ఎర్ర వీరస్వామి మాదిగ, బోడ శ్రీరాములు మాదిగ, వల్లపట్ల దయానంద్, అమరారపు, పద్మభూషణం మాదిగ, చింత జాన్ విల్సన్ మాదిగ, మల్లేష్ మాదిగ, డాక్టర్ బట్టు గోపి, మాలమహానాడు నాయకులు తల్లమల్ల హస్సేన్, బొల్లెద్దు వినయ్, గాలి వికాస్, ఇతర ప్రజా, కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి


