శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించేలా..
హుజూర్‌నగర్ : విద్యార్థుల్లో శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రతిఏటా జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో జరగనున్న చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 8–10 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షను రాయొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.5, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.10లు చొప్పన పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్షా విధానం..
చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్షలో విద్యార్థులకు 8 నుంచి 10 తరగతులకు చెందిన సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మొదటగా పాఠశాల స్థాయిలో ప్రతిభా పరీక్ష నిర్వహించి ముగ్గురిని ఎంపిక చేసి ఈ నెల 21న మండలస్థాయిలో పరీక్షకు పంపిస్తారు. ఇందులో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి జిల్లాస్థాయికి నాలుగు జట్లను పంపిస్తారు. ఈ నెల 28న జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రతిభ పరీక్షకు ప్రతి మండలం నుంచి నాలుగు టీమ్‌లను పంపిస్తారు. జిల్లాస్థాయిలో క్విజ్, డిబేట్ అంశాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలను డిసెంబరు 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు కరీంనగర్‌లో నిర్వహించనున్నారు.
ఫ నేడు చెకుముకి సైన్స్ ప్రతిభా పరీక్ష
ఫ 8 నుంచి 10వ తరగతి
విద్యార్థులకు అవకాశం


