మంచి ఆలోచనలకు పునాది వేయాలి
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు మంచి ఆలోచనలకు పునాది వేయాలని, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నిరంతరం సాధన చేయాలని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం సూర్యాపేట మండలంలోని బాలెంలలో గల తెలంగాణ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలు, సోషల్ మీడియా ప్రభావం, లక్ష్యాలు, విజయ అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమస్యలకు కుంగిపోవద్దని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తప్పులను అధిగమిస్తూ విజయాల వైపు వెళ్లాలని, మంచి పుస్తకాలను, మంచి స్నేహితులను ఎంచుకోవాలని పేర్కొన్నారు. సైబర్ మోసాల నివారణకు వారియర్స్‌గా పని చేయాలన్నారు. అదేవిధంగా పోలీసు కళాబృందం సామాజిక అంశాలు, సామాజిక రుగ్మతలు, సామాజిక భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


