చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
సూర్యాపేట : విద్యార్థుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలు వినాలన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెల్ ఫోన్‌లను చదువుకోసం మాత్రమే వినియోగించాలన్నారు. 18 సంవత్సరాలు నిండనివారు వాహనాలు నడపవద్దని, దీని వల్ల తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్‌ఎంకు సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, హెచ్‌ఎం నాగరాణి, డిఫెన్స్ కౌన్సిల్స్ సుంకరబోయిన రాజు, బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, మిడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్


