పెదరాజుతండాలో విషాదఛాయలు
మోతె: మోతె మండలం బీక్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని పెదరాజుతండాలో విషా దఛాయలు అలుముకున్నాయి. పెదరాజుతండాకు చెదంఇన బానోతు శ్రీను రెండో కుమారుడు బానోతు మహేందర్‌నాయక్(21) సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్‌సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మహేందర్‌నాయక్ కళాశాలలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేందర్‌నాయక్ మృతిపై అతడి తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆత్మహత్యపై పూర్తి సమాచారం కావాలని కళాశాల యాజమాన్యాన్ని కోరుతున్నారు.


