ఇంటి వద్దే కోల్డ్ స్టోరేజీ
తిప్పర్తి : ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను దళారులు అడిగిన రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి అధిగమించేందుకు ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. పంటను నిల్వ చేసుకుని రేటు ఉన్న సమయంలో అమ్ముకునేలా తన ఇంటి వద్ద కోల్డ్ స్టోరేజీ నిర్మించుకున్నాడు. ఈ కోల్డ్ స్టోరేజీలో తనతోపాటు చుట్టుపక్కల రైతుల పంటలను కూడా నిల్వ చేస్తున్నాడు. ధర పెరిగినప్పుడే పంటలను విక్రయించి లాభాలు పొందుతున్నాడు.
రూ.10 లక్షలతో కోల్డ్ స్టోరేజి ఏర్పాటు
సిలార్‌మియాగూడెం గ్రామంలో రైతు సుదర్శన్‌రెడ్డి హార్టికల్చర్ అధికారుల సహకారంతో కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.10 లక్షల రుణం తీసుకుని సొంతంగా కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కోల్డ్ స్టోరేజీలో తాను పండించిన పంటలతోపాటు చుట్టు పక్కల గ్రామాల రైతుల పంటలను కూడా కొద్దిపాటి అద్దె తీసుకుని నిల్వ చేస్తున్నాడు. ఈ కోల్డ్ స్టోరేజీలో పంటలు సుమారు నెల రోజుల వరకు నిల్వ ఉంటున్నాయి. రైతు సుదర్శన్‌రెడ్డి సాగు చేస్తున్నా డ్రాగన్ ఫ్రూట్స్ ధరలేని సమయంలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసి.. ధర పెరిగాక అమ్ముతున్నాడు.
నష్టాలను
అధిగమించేలా..
తిప్పర్తి మండలం సిలార్‌మియాగూడెం గ్రామానికి చెందిన రైతు చింతకుంట్ల సుదర్శన్‌రెడ్డి ఐదు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, కూరగాయలు సాగు చేస్తుంటాడు. డ్రాగన్ ఫ్రూట్ కోత వచ్చినప్పుడు నిల్వ ఉండదు. చెట్టుపైనే కుళ్లిపోతుంది. ఒకవేళ తెంపినా అదే రోజు అమ్మాలి. అంటే.. వ్యాపారులు అడిగిన ధర ఇవ్వాల్సి వస్తుంది. ఇక, కూరగాయలు కూడా నిల్వ ఉండకపోవడంతో ఏరోజుకారోజు ధర ఉన్నా, లేకున్నా.. మార్కెట్లకు వెళ్లి వ్యాపారులు అడిగిన ధరకు ఇచ్చి వెనుదిరిగి రావాల్సిందే. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టాలను అధిగమించేందుకు రైతు సుదర్శన్‌రెడ్డి వినూత్న ఆలోచన చేశాడు.
సొంతంగా శీతల గిడ్డంగి నిర్మించుకున్న రైతు
ఫ నష్టాలను అధిగమించేందుకు
వినూత్న ఆలోచన
ఫ ఎక్కువ రోజులు పంట నిల్వ
ఫ ధర ఉన్నప్పుడు విక్రయిస్తూ లాభం
పొందుతున్న సుదర్శన్‌రెడ్డి
ఇంటి వద్దే కోల్డ్ స్టోరేజీ
ఇంటి వద్దే కోల్డ్ స్టోరేజీ


