
మెనూ ప్రకారం భోజనం అందించాలి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జీసీడీఓ (గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్) కె.దయానందరాణి ఆదేశించారు. ఆత్మకూర్(ఎస్) ఎస్సీ హాస్టల్‌లో అన్నం సరిపోవడం లేదని కొందరు విద్యార్థులు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో పోలీసులు వార్డెన్‌కు సమాచారం అందించి రాత్రి అన్నం వండించి విద్యార్థులకు పెట్టారు. ఈ వార్త పత్రికల్లో రావడంతో స్పందించిన జీసీడీఓ .. గురువారం ఉదయం ఆ హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్ వార్డెన్ రవికుమార్,ఇతర వర్కర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగారు. మెనూ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ జీసీడీఓ దయానందరాణి