
ఒక్కరు చాలనుకున్నాం
చిరుద్యోగులుగా పని చేస్తున్నందున మాకు ఒక్కరు చాలను కున్నాం. అమ్మాయి అయినప్పటికీ మరొకరిని కనలేదు. ఒక్క అమ్మాయికే మంచి విద్యాబుద్ధులు నేర్పించాలనుకున్నాం. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో ఆరవ తరగతి చదివిస్తున్నాం. ఒంటరిగా పెరుగుతున్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది పడడం లేదు. చుట్టుపక్కల పిల్లలతో, పాఠశాలలో తోటి వారితో ఆనందంగా ఉంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులు ఇద్దరు పిల్లలను పెంచాలంటే ఇబ్బందే. దానిని ముందే గుర్తించి ఒక్కరే చాలనుకున్నాం. ఒక్క కూతురితో ప్రస్తుతం ఆనందంగానే ఉన్నాం. కొడుకు లేడనే బాధ ఏమీలేదు.
–కూతురు తేజశ్రీతో జీవిత–హుస్సేన్ దంపతులు, కోదాడ