సీఎంఆర్‌ అప్పగింతపై అలసత్వం | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ అప్పగింతపై అలసత్వం

Mar 16 2025 2:01 AM | Updated on Mar 16 2025 1:57 AM

భానుపురి (సూర్యాపేట): కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను ప్రభుత్వానికి అప్పగించడంపై మిల్లర్లు మొండికేస్తున్నారు. గడువు దాటినా తమకు కేటాయించిన లక్ష్యాన్ని తిరిగి ఇవ్వడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో ప్రతి సీజన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి తిరిగి బియ్యం ఇవ్వకుండా సొంత వ్యాపారం చేయడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. 2023–24 యాసంగికి సంబంధించి ఇంకా 35 శాతానికి పైగా బియ్యం రావాల్సి ఉంది. మిల్లర్ల వైఖరి కారణంగా జిల్లాలో నాలుగైదు నెలలుగా బియ్యం నిల్వలు లేక.. రేషన్‌ పంపిణీ కూడా ఆలస్యమవుతోంది.

లక్ష్యం 1,62,140 మెట్రిక్‌ టన్నులు

2023–24 యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి 49 మిల్లులకు ధాన్యాన్ని కేటాయించారు. ఈ ధాన్యాన్ని మూడునెలల లోగా మర ఆడించి తిరిగి పౌరసరఫరాల శాఖకు అందించాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,62,140 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ధాన్యాన్ని కేటాయించి ఏడాది కావొస్తున్న లక్ష్యంలో ఇంకా 35 శాతం మేర బకాయి ఉంది. ఇప్పటి వరకు 1,04,143 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు తిరిగి ఇచ్చేయగా.. మరో 57,997 మెట్రిక్‌ టన్నుల ధాన్యం బకాయి పడ్డారు.

ఫ గడువు పొడిగిస్తున్నా..

బియ్యం అందించని మిల్లర్లు

ఫ గత యాసంగి సీజన్‌ బకాయి

57వేల మెట్రిక్‌ టన్నులకు పైగానే..

ఫ రేపటితో ముగియనున్న గడువు

2023–24 యాసంగి సీఎంఆర్‌ లక్ష్యం 1,62,140 మెట్రిక్‌ టన్నులు

ఇప్పటి వరకు ఇచ్చింది

1,04,143 మెట్రిక్‌ టన్నులు

పెండింగ్‌లో ఉన్నది

57,997 మెట్రిక్‌ టన్నులు

గడువు పొడిగిస్తున్నా..

జిల్లాలో సీఎంఆర్‌ విషయంలో ప్రతి సీజన్‌లో మిల్లర్లు మాయాజలం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన వరిధాన్యాన్ని సమయానికి మర ఆడించి బియ్యం ఇవ్వడం లేదు. ఈ విషయంలో కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం ఇచ్చిన మూడునెలలకే బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 2023–24 యాసంగి సీజన్‌కు ఇప్పటివరకు ప్రభుత్వం మూడుసార్లు గడువును పొడిగించింది. అయినా జిల్లాలోని 11 మిల్లులు మాత్రమే పూర్తిస్థాయిలో బియ్యాన్ని ఇచ్చేశాయి. మిగతా వాటిలో 38 మిల్లులు 90 శాతానికి పైగా ఇవ్వగా.. మరో 11 నుంచి 12 మిల్లుల నుంచి పెద్ద ఎత్తున సీఎంఆర్‌ ఇవ్వాల్సి ఉంది. సీఎంఆర్‌ సేకరణలో అధికారులు నిత్యం తనిఖీలు, సమీక్షలు చేపడుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. కాగా ఈనెల 17వ తేదీ వరకు గడువు ఉండడంతో గడువులోగా సీఎంఆర్‌ అప్పగింతపై అనుమానాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement