జూన్‌ 8న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ | Sakshi
Sakshi News home page

జూన్‌ 8న జాతీయ మెగా లోక్‌అదాలత్‌

Published Sun, May 19 2024 7:35 AM

జూన్‌ 8న జాతీయ మెగా లోక్‌అదాలత్‌

చివ్వెంల(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో జూన్‌ 8న నిర్వమించే జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌ అదాలత్‌ నిర్వహణపై ప్రజలకు, కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగకుండా లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని, దీనివల్ల ఇరువర్గాల వారు గెలిచిన వారు కావడంతోపాటు కాలం, ధనం వృథా కాకుండా ఉంటుందన్నారు. సివిల్‌, క్రిమినల్‌, బ్యాంకు, ఎకై ్సజ్‌, వెహికల్‌ యాక్టు వంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శ్యామ్‌శ్రీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.శ్రీవాణి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.సురేష్‌, ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, వివిధ మండలాల ఎస్‌ఐలు, కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆలేరుకు నేడు కేటీఆర్‌ రాక

యాదగిరిగుట్ట: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం ఆలేరుకు రానున్నట్లు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. స్థానిక ఇమ్మడి నర్సింహారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించనున్న నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరుకానున్నారని పేర్కొన్నారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి రానున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement