గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 32 కేంద్రాలు | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 32 కేంద్రాలు

Published Sun, May 19 2024 7:35 AM

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 32 కేంద్రాలు

సూర్యాపేట: జూన్‌ 9న నిర్వహించే గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షకు జిల్లాలో 32 కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ ఎస్‌.వెంకటరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌నకు ఏఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. 32 కేంద్రాల్లో 9,725 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల సూపరింటెండెంట్‌ పద్మారావు తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ రహిత సమాజమే లక్ష్యం

ప్లాస్టిక్‌ రహిత సమాజమే మన ముందున్న లక్ష్యమని కలెక్టర్‌ వెంకటరావు అన్నారు. శనివారం అదనపు కలెక్టర్లు సీహెచ్‌.ప్రియాంక, బీఎస్‌.లతతో కలిసి జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగులతో నిర్వహించిన వెబెక్స్‌లో మాట్లాడారు. ప్లాస్టిక్‌ నిషేధం అమలుకు జిల్లాస్థాయిలో అదనవు కలెక్టర్‌ ప్రియాంక నోడల్‌ అధికారిగా, కలెక్టరేట్‌కు నోడల్‌ అధికారిగా అదనపు కలెక్టర్‌ లత వ్యవహరిస్తారని తెలిపారు. కలెక్టరేట్‌, ఆర్డీఓ, ఎంపీడీఓ, తహసీల్దార్ల కార్యాలయాలతోపాటు, పాఠశాలలు, వసతి గృహాలు, హాస్పిటళ్లలో మూడు విడతలుగా ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేయాలన్నారు. వచ్చే మంగళవారం నుంచి కలెక్టరేట్‌లో వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ సంచులు నిషేధించాలని, లేకుంటే సంబంధిత కార్యాలయానికి జరిమానా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, కలెక్టరేట్‌ ఏఓ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ వెంకటరావు

Advertisement
 
Advertisement
 
Advertisement