ఆదాయానికి గండి | Sakshi
Sakshi News home page

ఆదాయానికి గండి

Published Sun, May 19 2024 7:30 AM

ఆదాయానికి గండి

భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట మామిడి మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలం కొనసాగుతోంది. అధికారులతో కుమ్మక్కై వ్యవసాయ మార్కెట్‌ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఏటా సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతుందన్న అంచనాలు ఉన్నప్పటికీ దాదాపుగా రూ.కోటిన్నరకుపైగా ఆదాయాన్ని కోల్పోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం వ్యాపారులు నిర్వహించిన కొనుగోళ్లలో మార్కెట్‌ కమిటీకి ఒక్క శాతం ఫీజు రూపేనా చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా రూ.కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ మార్కెట్‌ ఫీజు రూపేనా ఏటా రూ.15లక్షల నుంచి రూ.25 లక్షలలోపు మాత్రమే ఆదాయం సమకూరుతోంది.

నిత్యం 30 లారీల్లో..

సూర్యాపేటలో ప్రత్యేకంగా మామిడికి మార్కెట్‌ లేకున్నా.. జనగామ క్రాస్‌రోడ్డు సమీపంలో 17 మంది లైసెన్స్‌డ్‌ వ్యాపారులతోపాటు మరో ముగ్గురు అనధికారికంగా షెడ్లలో వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌, చండీగఢ్‌, హరియానా, పంజాబ్‌, నాగ్‌పూర్‌ తదితర రాష్ట్రాలకు రోజూ 20 నుంచి 30 లారీల్లో మామిడి కాయలను ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం టన్నుకు రూ.30వేల వరకు ధర ఉండగా ఒక్కో లారీలో తరలించే 15 టన్నులకు రూ.4.50 లక్షలు విలువ ఉంటుంది. వ్యాపారులు మార్కెట్‌ ఫీజు నిమిత్తం ఒక్కశాతం ఫీజు చెల్లిస్తే ఒక్కో లారీకి రూ.4,500లను అవుతోంది. ఈ లెక్కన ప్రతిరోజూ సగటున మార్కెట్‌కు రూ.90వేల నుంచి రూ.1.35లక్షల వరకు ఫీజు రావాల్సి ఉంది. దాదాపుగా మూడునెలలు కొనసాగే మార్కెట్‌తో రూ.కోటిన్నర వరకు ఆదాయం వచ్చే అవకాశముంది.

ఫీజు చెల్లింపు అంతంతే..!

మామిడికాయ ధర పెరిగిన సందర్భంలో దాని ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వ్యాపారులు అధిక రేటుకు మామిడికాయలు కొనుగోలు చేసినా తక్కువ రేటుకు కొనుగోలు చేశామని గోల్‌మాల్‌ చేస్తూ ఆ మేరకు అధికారులకు మార్కెట్‌ ఫీజు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులతో కుమ్మక్కు అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుని ఆదాయానికి గండి పడకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

మామిడి మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలం

ఫ అధికారులతో కుమ్మకై ్క

తక్కువ ఫీజు చెల్లింపు

ఫ ఏటా రూ.కోట్లలో వ్యాపారం

ఫ రూ.అరకోటి దాటని మార్కెట్‌ ఫీజు

వసూలైన ఫీజు వివరాలు

సీజన్‌ ఫీజు (రూ.లక్షల్లో..)

2022 22.51

2023 19.84

2024 (ఇప్పటి వరకు) 3.39

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement