ఎన్‌జీఆర్‌ఐ ముఖ్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు | Sakshi
Sakshi News home page

ఎన్‌జీఆర్‌ఐ ముఖ్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు

Published Wed, Nov 15 2023 1:28 AM

శాస్త్రవేత్త శ్రీనివాస్‌ శర్మ
 - Sakshi

ఎస్‌జీఏటీ నుంచి సీతారాం రుంగ్తా స్మారక పురస్కారాన్ని అందుకున్న శ్రీనివాస్‌ శర్మ

గరిడేపల్లి : హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ ద్రోణ శ్రీనివాస్‌ శర్మకు భువనేశ్వర్‌లోని సొసైటీ ఆఫ్‌ జియోసైంటిస్ట్స్‌ అండ్‌ అలైడ్‌ టెక్నాలజీ (ఎస్‌జీఎటీ) నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. 2023వ సంవత్సరానికి గాను ఆయన సీతారాం రుంగ్తా స్మారక అవార్డు అందుకున్నారు. ద్రోణ శ్రీనివాస్‌ శర్మది గరిడేపల్లి మండల పరిధిలోని సర్వారం గ్రామం. డాక్టర్‌ శర్మ 2003లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జియోకెమిస్ట్రీ, జెనిసిస్‌ ఆఫ్‌ గోల్డ్‌ మినరాలజీలో డాక్టరేట్‌ అందుకున్నారు. భారతీయ బంగారు నిక్షేపాలపై కాల పరిమితులను అందించిన మొదటి వ్యక్తి డాక్టర్‌ శర్మ. ఆయన కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక రామన్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కింద పనిచేశారు. ఆయన తెలంగాణ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ఫెలోగా కూడా ఉన్నారు. 2022లో ప్రతిష్టాత్మక జాతీయ భూ విజ్ఞాన పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

Advertisement
Advertisement