మహిళతో అసభ్యకర ప్రవర్తన | Sakshi
Sakshi News home page

మహిళతో అసభ్యకర ప్రవర్తన

Published Wed, Nov 15 2023 1:28 AM

-

నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా

అడ్డగూడూరు : మహిళతో అసభ్యకర్తంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ రామన్నపేట కోర్టు జడ్జి మంగళవారం తీర్పు వెలువరించారు. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన జగాటి సైదులు 2014వ సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమె ఒంటరిగా ఉండగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ సైదులుపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నేరం నిరూపణ కావడంతో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారని అడ్డగూడూరు ఎస్‌ఐ నాగరాజు వివరించారు.

Advertisement
 
Advertisement