నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో మంగళవారం భారీ వర్షం కురిసింది. రాత్రి 8.30 గంటల నుంచి ఏకధాటిగా వర్షం కురవడడంతో వీధులు జలమయమయ్యాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన భూగర్భ డ్రైనేజీ సిస్టం పూర్తిగా విఫలం కావడంతో ఇప్పుడు చిన్న వర్షం పడినా వర్షం నీటితో వీధులు నిండిపోతున్నాయి. మెయిన్ రోడ్డుకు ఆనుకొని నిర్మించిన కాలువలు పూర్తిగా పూడికలతో నిండిపోవడంతో రోడ్డుపైనే నీరు ప్రవహిస్తోంది. ముఖ్యంగా బజారు వీధి, మఠంవీధి, నాయుడు వీధి, పుండరీకాక్ష కాలనీ, జోగిపేట కూడలిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.


