చరిత్రపై చెరగని సంతకం
కంచిలి:
పేదలు ప్రభుత్వ సాయంతో వైద్య విద్య చదువుకోవాలనే సదుద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయా న్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ చేపడుతున్న కోటి సంతకాల ఉద్యమం జిల్లా వ్యాప్తంగా పతాకస్థాయికి చేరుకుంది. కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆద్యంతం ఉత్సాహంగా పార్టీ క్యాడర్ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకెళ్లి, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారి మద్దతును సంతకాల రూపంలో కూడగడుతున్నారు. నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, పార్టీ క్యాడర్‌ను సమన్వయపరుస్తూ ప్రైవేటీకరణ అనర్థాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
నినాదం వినిపించకున్నా నిరసన జ్వాల రగులుతోంది. పిడికిలి బిగించకున్నా ఉద్యమ స్ఫూర్తి ప్రజ్వరిల్లుతోంది. ప్రజల మెడపై వేలాడదీయాలనుకుంటున్న ‘ప్రైవేటు’ కత్తికి వ్యతిరేకంగా ఊరూవాడా సంతకాలు పెడుతోంది. పత్రాలపై చేస్తున్న పోరాటం పతాక స్థాయికి చేరుకుంది. వైఎస్సార్ సీపీ శ్రీకారం చుట్టిన కోటి సంతకాల లక్ష్యానికి సిక్కోలు తన వంతు బాధ్యతను పూర్తి చేస్తోంది. సిక్కోలు రాజకీయ చరిత్రపై ఇది చెరగని సంతకంలా నిలవనుంది.
చరిత్రపై చెరగని సంతకం
చరిత్రపై చెరగని సంతకం
చరిత్రపై చెరగని సంతకం


