‘పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయండి’ | - | Sakshi
Sakshi News home page

‘పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయండి’

Dec 9 2025 7:02 AM | Updated on Dec 9 2025 7:02 AM

‘పార్

‘పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయండి’

నరసన్నపేట: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ పిలుపుమేరకు నియోజకవర్గాల్లో నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమం చివరి దశకు చేరిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 10న నియోజకవర్గ కేంద్రాల్లో సంతకాలు చేసిన ప్రతులు ప్రదర్శించాలని, అనంతరం వాటిని జిల్లా కేంద్రానికి వాహనాల్లో పంపించాలని కృష్ణదాస్‌ కోరారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకట న విడుదల చేశారు. 10న నిర్వహించనున్న కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మంగళవారం పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిశీ లకులు కుంభా రవిబాబుతో కలసి నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. అలాగే 15 న సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

పీజీ మిగులు సీట్లకు

తక్షణ ప్రవేశాలు

ఎచ్చెర్ల: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో వివిధ పీజీ కోర్సుల్లో మిగులు సీట్లకు తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఈ ప్రవేశాలు మంగళవారం నుంచి క్యాంపస్‌ కేంద్రంగా నిర్వహించనున్నామని తెలిపారు. ఏపీపీజీసెట్‌కు హాజరై ఇప్పటివరకూ సీటు పొందని వారితో పాటు ప్రవేశ పరీక్ష రాయని వారు కూడా స్పాట్‌ అడ్మిషన్లకు హజరు కావచ్చునని తెలిపారు. అయితే పరీక్ష రాసిన వారు రూ.500, పరీక్ష రాయని వారు రూ.800 రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని రిజిస్ట్రార్‌ తెలిపారు. ఈ అడ్మిషన్లు ఈ నెల 12 వ తేదీ వరకూ కొనసాగుతాయని సంబంధిత విద్యా ర్హతల ధ్రువీకరణ పత్రాలతో ఆయా విభాగాల వద్దకు విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి హాజరుకావచ్చని తెలిపారు. స్పాట్‌ ద్వారా సీట్లు పొందిన వారికి ఎలాంటి ఉపకార వేతనాలు మంజూరుకావని తెలిపారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. బిఆర్‌ఏయూ.ఈడీయూ.ఇన్‌ ను చూడవచ్చని తెలిపారు. ఇంగ్లిష్‌ 15, తెలుగు 17, ఎంజేఎంసీ 22, సోషల్‌వర్క్‌ 29, ఎంఎల్‌ఐసీ 24, రూరల్‌ డెవలప్‌మెంట్‌ 19, ఎకనామిక్స్‌ 25, ఎంకామ్‌ 4, ఎంఈడీ 20, బయోటెక్‌ 1, మైక్రోబయాలజీ 2, మేద్స్‌ 23, పిజిక్స్‌ 19, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ 2 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు సాహసయాత్రకు అవకాశం

టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు సాహసయాత్రలో పాల్గొనే అవకాశం వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ టి.గోవిందమ్మ సోమవారం తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల అటల్‌ బిహారీ వాజ్‌పేయి పర్వతారోహణ, క్రీడా సంస్థలో పది రోజుల పాటు సాహస యాత్రలో పాల్గొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొగ్రాం అధికారి వి.ల్యూక్‌పాల్‌తో పాటు వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.సతీష్‌కుమార్‌ తదితరులు విద్యార్థులను అభినందించారు.

చెక్‌పోస్టు ఏర్పాటుకు

సన్నాహాలు

పొందూరు: ‘సాక్షి’లో వెలువడిన ‘కొండకు గుండెకోత’ కథనానికి అధికారులు స్పందించారు. వీఆర్‌ గూడెం కొండపై అక్రమంగా ఎర్రమట్టి మాఫియా మైనింగ్‌ జరుపుతుండటంపై కథనం ప్రచురితమైంది. దీంతో సోమవారం విజయనగరం విజిలెన్స్‌ అధికారు లు మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాలను తనిఖీ చేశారని తహసీల్దార్‌ వెంకటేష్‌ రామానుజుల తెలిపారు. చెక్‌పోస్టు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అక్రమంగా మైనింగ్‌ జరిపిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అక్రమంగా గ్రావెల్‌ తవ్విన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మట్టి తవ్వి క్రషర్‌లో కలుపుకున్న స్థలంపై విచారణ జరిపి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

‘పార్టీ కార్యక్రమాలు   విజయవంతం చేయండి’ 1
1/2

‘పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయండి’

‘పార్టీ కార్యక్రమాలు   విజయవంతం చేయండి’ 2
2/2

‘పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయండి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement