సోంపేటలోభారీచోరీ
● 30 తులాల బంగారం, రూ.లక్ష నగదు మాయం
సోంపేట: సోంపేట పట్టణం సోమవారం ఉద యం ఉలిక్కిపడింది. ఒక ఇంటిలో సుమారు 30 తులాల బంగారం, రూ.లక్ష నగదు చోరీ కావడంతో పట్టణవాసులు ఆందోళన చెందారు. నిత్యం జనాలు తిరిగే ప్రాంతంలో అది కూడా కోర్టుకు సమీపంలో దొంగతనం జరగడం గమనార్హం. సోంపేట పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..
పట్టణానికి చెందిన తంగుడు మనోజ్ కుటుంబం కోర్టు పేట వీధిలో నివాసం ఉంటోంది. తంగుడు మనోజ్ పట్టణంలో ఓ శుభకార్యానికి కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం హాజరయ్యారు. అనంతరం ఇద్దరు పిల్లలను ఇంటిలో విడిచిపెట్టి బరంపురంలో మరో శుభ కా ర్యానికి తన భార్యతో కలిసి వెళ్లారు. బరంపురం నుంచి తిరిగి వస్తుండగా ఇచ్ఛాపురం జాతీయ రహదారి వద్ద గుర్తుతెలియని ద్విచక్ర వాహనం మనోజ్ బైక్‌ను ఢీకొట్టింది. కాలికి గాయమైంది. దీంతో మానసిక ఆందోళనకు గురైన మనోజ్ ఆదివారం రాత్రి ఇంటికి తాళం వేసి అన్నయ్య శ్రీను ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు.
మారిన తాళం..
సోమవారం ఉదయం ఇంటికి వెళ్లిన మనోజ్ కుటుంబ సభ్యులు గేటుకు వేసిన తాళం మారి ఉండడాన్ని గమనించారు. అప్పుడే వారిలో ఆందోళన మొదలైంది. ఆ తాళం పగులగొట్టి ఇంటికి వెళ్లి చూసేసరికి సుమారు 30తులాల బంగారం, రూ.లక్ష నగదు కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. బీరువా తాళాలు తీసి నగదు, బంగారం తస్కరించి మళ్లీ బీరువా తాళా లు వేయడం విశేషం. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీమ్‌తో ఇంటికి చేరుకుని పరిశీలించారు. సోంపేట సీఐ బి.మంగరాజు, ఎస్‌ఐ వి.లోవరాజు ఇంటిని పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆదివారం రాత్రి 12 గంటల నుంచి వేకువ జామున 3 గంటలోపు దొంగతనం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మనో జ్ ఫిర్యాదు మేరకు సోంపేట ఎస్‌ఐ లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
సోంపేటలోభారీచోరీ


