చిన్నారులపై అకృత్యాలు అరికట్టాలి
గార: చిన్నారులపై అకృత్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గార ఏఎస్‌ఐ తెలుగు చంద్రమోహన్ అన్నారు. చిన్నారులపై లైంగిక అకృత్యాలు – బాధితుల మానసిక పరిస్థితులుపై శనివారం గార మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల ఉద్యోగులకు ఒక రోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. జిల్లా బాధిత చిన్నారుల సంరక్షణ కేంద్రం (డీఈఐసీ) సైకాలజిస్ట్ డాక్టర్ రెడ్డి రాజ్‌కుమార్, గార పీహెచ్‌సీ వైద్యాధికారి రమ్య, కళింగపట్నం పీహెచ్‌సీ వైద్యాధికారి మౌనిక, ఎంఈఓ–2 పి.వినోదిని తదితరులు పాల్గొన్నారు.


