విద్యార్థులకు శాపం!
టెక్కలి: పదో తరగతి వరకు బాలికోన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థినులు ఇంటర్మీడియెట్ సైతం అక్కడే చదువుకునే విధంగా బాలికా విద్యను ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్లస్ 2 పాఠశాలలను ఏర్పాటు చేశారు. టెన్త్ అనంతరం ఎటువంటి డ్రాపౌట్స్ లేకుండా బాలి కలు ఇంటర్ విద్యను పూర్తి చేయాలనే ఉన్నత లక్ష్యంతో ఈ స్కూళ్లకు రూపకల్పన చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్లస్ 2 పాఠశాలలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2025–26 అకడమిక్ విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకున్నా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అరకొరగా పుస్తకాలను సరఫరా చేశారు. మరికొన్ని పాఠశాలలకు పూర్తిగా పుస్తకాలే సరఫరా చేయకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 మంది సెకెండియర్ విద్యా ర్థినులు చదువుతున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పుస్తకాలు లేకుండా ఎలా పరీక్షలు రాయాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
నేను ఎంపీసీ సెకెండియర్ చదువుతున్నాను. ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వలేదు. గతంలో చదివిన వారి నుంచి పుస్తకాలు సేకరించి వాటితో సర్దుకుపోతున్నాం. పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నాం.
– డి.వర్ష, ఎంపీసీ సెకెండియర్,
ప్లస్ 2 పాఠశాల, టెక్కలి
ముందు బ్యాచ్ వరకు పుస్తకాలు సరఫరా చేశారు. ఇప్పుడు పుస్తకాలు ఇవ్వలేదు. పాత పుస్తకాలతో అవస్థలు పడుతున్నాం. మరికొద్ది రోజుల్లో పరీక్షలు జరగనున్నాయి. పాఠ్య పుస్తకాలు లేక ఇబ్బందిగా మారింది.
– ఎస్.శ్రీజ, ఎంపీసీ సెకెండియర్, టెక్కలి
చక్కగా పాఠాలు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు. మా ఉపాధ్యాయుల సహకారంతో పాత విద్యార్థుల దగ్గర నుంచి పుస్తకాలు తీసుకుని తరగతి గదిలో మాత్రమే చదువుతున్నాం.
– కె.తేజస్విని,
బైపీసీ సెకెండియర్, టెక్కలి
బాలికా విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ప్లస్ 2 పాఠశాలల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థినులకు ఇప్పటి వరకు పుస్తకాలు సరఫరా చేయకపోవడం దారుణం.
– తమ్మినేని చందనరావు,
ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్లస్ 2 స్కూళ్లలో సెకెండియర్ విద్యార్థినులకు అందని పుస్తకాలు
మరికొన్ని పాఠశాలలకు అరకొరగా పుస్తకాలు
ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
విద్యార్థులకు శాపం!
విద్యార్థులకు శాపం!
విద్యార్థులకు శాపం!
విద్యార్థులకు శాపం!
విద్యార్థులకు శాపం!


