నేడు ‘పోరుబాట కై త’ కవితా పఠనం
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు ‘పోరుబాట కైత’ కవితా పఠనం నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్ట్, థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసనను ప్రతిబింబించేలా కవుల స్పందనను తమ కవిత్వం ద్వారా వినిపించాలని కోరారు. కవులందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు.
పోలీసు శిక్షణా కేంద్రం పరిశీలన
శ్రీకాకుళం క్రైమ్/శ్రీకాకుళం రూరల్: తండేవలసలోని జిల్లా పోలీసు శిక్షణాకేంద్రాన్ని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి శనివారం సందర్శించారు. ఇటీవల ఎంపికై న స్టైపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో మైదానం, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, బ్యారెక్స్, మంచినీటి సరఫరా, మెస్, భోజనశాల, స్నానాల గదులు, విద్యుత్తు సదుపాయాలను ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, సీఐలు ఇమ్మాన్యుయెల్ రాజు, పైడపునాయుడు, అవతారం, కృష్ణమూర్తి, ఆర్‌ఐలు నర్సింహరావు, శంకర్‌ప్రసాద్ పాల్గొన్నారు.
ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్
ఇచ్ఛాపురం రూరల్: మండపల్లి పంచాయతీ పూర్వ కార్యదర్శులు గురుమూర్తి, ఎస్.కృష్ణలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ ఎ.ప్రభాకరరావు శనివారం తెలిపారు. పంచాయతీ పరిపాలనకు సంబంధించి రికార్డులలో తారుమారు, ఆర్థిక వ్యవహారాల్లో తేడాలు రావడంతో జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య వీరిద్దరినీ సస్పెండ్ చేసినట్లు తమకు ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు.
పోలీసుల మోహరింపు
టెక్కలి: టెక్కలి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సాధారణ సర్వ సభ్య సమావేశానికి పోలీసులు మోహరించారు. ఎంపీపీ ఆట్ల సరోజనమ్మ, ఎంపీడీఓ రేణుక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సభ్యులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడంతో నామమాత్రంగానే సమావేశాన్ని కొనసాగించారు.
నేడు ‘పోరుబాట కై త’ కవితా పఠనం


