చోరీ కేసుల్లో నిందితుడు అరెస్టు
టెక్కలి రూరల్: టెక్కలి పరిధిలో పలు చోరీలకు పాల్పడిన యువకుడిని శనివారం టెక్కలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. టెక్కలి కండ్రవీధికి చెందిన బెనియా జగబందు అలియాస్ పోతురాజు 2024లో ఎన్టీఆర్ కాలనీ, అయ్యప్పనగర్, రేవతిపతి వీధుల్లో దొంగతనం, 2025లో సైనికనగర్‌కు చెందిన సంపతిరావు అచ్చుతరావు ఇంట్లో చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం స్థానిక మెళియాపుట్టి ఫ్‌లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జగబంధును అదుపులోకి తీసుకున్నారు. 78.205 గ్రాముల బంగారు ఆభరణాలు, 38 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.10వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


