ముగిసిన ఇంటర్ క్యాంపస్ క్రీడాపోటీలు
ఎచ్చెర్ల : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) పరిధిలో నాలుగు క్యాంపస్‌ల విద్యార్థులకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ క్యాంపస్ స్పోర్ట్స్ మీట్ శనివారంతో ముగిసింది. వాలీబాల్ పురుషుల విభాగంలో నూజివీడు ప్రథమ, శ్రీకాకుళం ద్వితీయ స్థానం సాధించింది. మహిళ విభాగంలో శ్రీకాకుళం ప్రథమ, నూజివీడు ద్వితీయ స్థానం సాధించింది. చెస్ పోటీలో శ్రీకాకుళం మహిళల జట్టు విజేతగా నిలిచింది. కార్యక్రమంలో డైరెక్టర్ బాలాజీ, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, దిలీప్‌కుమార్, కృష్ణంరాజు, నవీన్, లావణ్య, పీఆర్‌వో షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.


