పవర్ ప్లాంట్ ఏర్పాటును విరమించుకోవాలి
బూర్జ: థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోకపోతే ప్రతిఘటన తప్పదని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి సవర సింహాచలం హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం అన్నంపేట పంచాయతీ జె.వి.పురం గిరిజన గ్రామంలో పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ప్రతులను దహనం చేశారు. సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ సభ్యులు సవర నాగేష్, సింగయ్య, సింహాచలం, గోపాలరావు, బుగ్గన్న, తాతయ్య, మోజేష్, కల్లేపల్లి సింహాచలం, సీడ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


