బెల్టు తీసేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

బెల్టు తీసేదెప్పుడో?

Dec 6 2025 7:26 AM | Updated on Dec 6 2025 7:26 AM

బెల్ట

బెల్టు తీసేదెప్పుడో?

చర్యలు తీసుకుంటాం

సోంపేట : రాష్ట్రంలో తక్కువ ధరకే మద్యం విక్రయిస్తాం.. బెల్టు షాపులు రూపు మాపుతామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆచరణకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా సోంపేట మండలంలో మద్యం వ్యాపారం మొత్తం సిండికేట్‌ కనుసన్నల్లోనే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో బెల్టుషాపుల దందా జోరుగా సాగుతోంది. వైన్‌ షాపుల్లో విక్రయించాల్సిన 99 రూపాయలు మద్యం బాటిల్‌ ఒక్కటి కూడా మద్యం దుకాణాల్లో లభించడం లేదని, బెల్టు షాపుల్లో మాత్రం అదే బాటిల్‌ను రూ.140కు విక్రయిస్తున్నారని మందుబాబులు వాపోతున్నారు.

ఏ వీధి చూసినా..

బెల్టు దుకాణాలు నడిపితే చర్యలు తప్పవని అధికారులు ప్రకటనలు గుప్పించడం తప్ప అడ్డుకోవడం లేదు. మద్యం దుకాణాలతో సిండికేటుగా మారి బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మండలంలో సోంపేటలో 4, బారువలో 1, కొర్లాంలో 1 చొప్పున లైసెన్సు దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం వీటిలోనే మద్యం విక్రయాలు జరగాలి. కానీ వీటి పరిధిలో 23 పంచాయతీల్లో సుమారు 200కు పైగా బెల్టు షాపులు అనధికారికంగా నిర్వహిస్తున్నారని ఆయా గ్రామాల మహిళలు వాపోతున్నారు. వీటికితోడు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పలు హోటళ్లు, డాబాల్లో ఎప్పుడు పడితే అప్పుడు విచ్చలవిడిగా మద్యం దొరుకుతోందనే బహిరంగ రహస్యం. వీటిని అరికట్టాల్సిన ఎకై ్సజ్‌ అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఎప్పుడో ఒకసారి తూతూమంత్రంగా దాడులు నిర్వహించి మమా అనిపించేస్తున్నారు.

హైవే పక్కనే బెల్టుషాపులు..

కొర్లాం, పాలవలస జాతీయ రహదారి పక్కనే మద్యం విక్రయాలు కొనసాగుతుండడంతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కొర్లాం జాతీయ రహదారి పక్కన ప్రతి డాబాలో మందు విక్రయాలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దాడులు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో సిండికేట్లు ఆడిందే ఆటగా సాగుతోంది.

వీధిన పడుతున్న కుటుంబాలు..

గ్రామాల్లో వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు బెల్టుషాపుల్లో మద్యం అందుబాటులో ఉండటంతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కష్టపడి సంపాదించిన సొమ్మునంతా మందుకే ఖర్చు చేస్తున్నారంటూ మహిళలు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుని బెల్టుదుఖానాలు అదుపు చేయాలాని ప్రజలు కోరుతున్నారు.

బెల్టు షాపులు నిర్వహించకుండా చర్యలు చేపడతాం. ఇప్పటికే లైసెన్స్‌ దుకాణాదారులకు ఆదేశాలు జారీ చేశారు. బెల్లుషాపులు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. రూ.99 బాటిళ్లు తక్కువగా వస్తున్నాయి.

– రమణ, ఎకై ్సజ్‌ సీఐ

ఓ బెల్టు షాపు వద్ద

మందు తాగుతున్న వ్యక్తి

సోంపేట మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ మండల స్థాయి నాయకుల చేతిలోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామాలకు ఎంత నగదు ఇవ్వాలి, బెల్టు దుకాణాలకు మందు ఎలా సరఫరా చేయాలి.. తదితర విషయాలు వారే చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఎకై ్సజ్‌ అధికారులు దాడులు జరపకుండా చేస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి

యథేచ్ఛగా మద్యం బెల్టుషాపులు

పట్టించుకోని ఎకై ్సజ్‌ అధికారులు

రూ.99 బాటిల్‌ను రూ.140 విక్రయిస్తున్న వైనం

బెల్టు తీసేదెప్పుడో?1
1/3

బెల్టు తీసేదెప్పుడో?

బెల్టు తీసేదెప్పుడో?2
2/3

బెల్టు తీసేదెప్పుడో?

బెల్టు తీసేదెప్పుడో?3
3/3

బెల్టు తీసేదెప్పుడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement