వైఎస్సార్‌సీపీలో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

Dec 6 2025 7:26 AM | Updated on Dec 6 2025 7:26 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాల్లో నియమిస్తూ తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా అఫీషియల్‌ స్పోక్స్‌పర్సన్‌గా బర్ల వేణుగోపాలరావు(నరసన్నపేట), జిల్లా వైఎస్సార్‌ టీఎఫ్‌ అధ్యక్షుడిగా జల్లు బలరాంనాయుడు(ఆమదాలవలస), నియోజవకర్గాల వారీగా వైఎస్సార్‌టీఎఫ్‌ అధ్యక్షులుగా టి.ధర్మారావు(ఇచ్ఛాపురం), లింగాల సంజీవరావు(పాతపట్నం), ముద్దాడ శంకర్‌(ఎచ్చెర్ల), నిక్కు రాజశేఖరరావు(నరసన్నపేట), పినకాన వైకుంఠరావు(టెక్కలి), దుద్దు ముత్యాలనాయుడు(శ్రీకాకుళం), పంచాది జనార్దనరావు(ఆమదాలవలస)లను నియమించారు.

బూరగాంలో లింఫాటిక్‌ పరీక్షలు

కంచిలి: బూరగాం గ్రామంలో లింఫాటిక్‌ ఫిలేరియాసిస్‌ సంక్రమణకు సంబంధించిన పరీక్షలు కంచిలి పీహెచ్‌సీ వైద్యాధికారి టి.హరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహింరారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ సూచనల మేరకు 20 ఏళ్ల పైబడిన గ్రామస్తులలో రక్త స్మియర్లు సేకరించారు. కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్లు మురళి, రవి, ఎల్‌ఎల్‌హెచ్‌పీఎస్‌ నవ్య, ఆశ, ఏఎన్‌ఎంలు విద్యావతి, పుష్ప లత, సత్యవతి, సరోజిని, లక్ష్మి పాల్గొన్నారు.

జాతీయ స్విమ్మింగ్‌ పోటీలకు కేజీబీవీ విద్యార్థిని

ఇచ్ఛాపురం: జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు ఇచ్ఛాపురం కేజీబీవీ విద్యార్థిని గుమ్మడి శైలజ ఎంపికై నట్లు ఎస్‌ఓ శిరీష తెలిపారు. ఈ నెల 12 నుంచి 17 వరకు ఢిల్లీలో జరగనున్న స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ పోటీలలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయురాలు భారతి తెలిపారు. ఈ మేరకు విద్యార్థినికి ఆలయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు శుక్రవారం సురంగి రాజా క్రీడామైదానం ఆవరణలో క్రీడా దుస్తులు, రూ.5వేలు సాయం అందజేశారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షులు జి.ఉమాశంకర్‌, కార్యదర్శి వెంకటరావు, ప్రతినిధులు నరసింహమూర్తి, బత్తుల వెంకటరమణ పాల్గొన్నారు.

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: గ్రామ రెవెన్యూ సేవకులకు పే స్కేల్‌ అమలు చేయాలని, అర్హులైన వారికి వీఆర్వో, అటెండర్‌, డ్రైవర్‌ వంటి పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, వీఆర్‌ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు సత్యనారాయణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తి డిమాండ్‌ చేశారు. పే స్కేల్‌ అమలు చేయాలని, నైట్‌ డ్యూటీలు రద్దు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, నామినీలను వీఆర్‌ఓలుగా గుర్తించాలని కోరుతూ శుక్రవారం వీఆర్‌ఓలు శ్రీకాకుళం ఆర్‌ అండ్‌ బీ బంగ్లా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీనిర్వహించి కలెక్టరేట్‌ గేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.వి.లక్ష్మణమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఎన్‌.సీతప్పడు, డి.అప్పారావు, కె.కృష్ణ, బి.రాములమ్మ, మీనాక్షి, పద్మావతి, పి.అప్పలస్వామి, లోకనాథం, వెంకటరమణ, రామ్మూర్తి, సీహెచ్‌.లక్ష్మణరావు, ముకుంద, డి.కేశవ, రమణ తదితరులు పాల్గొన్నారు.

‘కార్గో’ నిర్వాసితులకు మెరుగైన పరిహారం

వజ్రపుకొత్తూరు: ఉద్దానం తీర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న కార్గో ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందిస్తామని, రైతుల పొట్టకొట్టే పరిస్థితి ఉండదని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఎయిర్‌పోర్టు స్పెషల్‌ ఆఫీసర్‌ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం వజ్రపుకొత్తూరు తహసీల్దార్‌ కార్యాలయంలో పలాస ఆర్డీఓ జి.వెంకటేష్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కార్గో ఎయిర్‌ పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాది అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోని కార్గో ఎయిర్‌పోర్టులో 11ది అవుతుందన్నారు. 1200 ఎకరాలు భూ సేకరణకు నిర్ణయించామని, ఇందులో ప్రభుత్వ భూమి 200 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. రైతుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమికి జిరాయితీ భూమితో సమానంగా పరిహారం అందిస్తామన్నారు. గ్రామాలకు ముప్పు లేనందున ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వర్తించదని స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్‌ ధర కన్నా రెండున్న రెట్లు పరిహారం అందిస్తామని, ల్యాండ్‌ పూలింగ్‌ పథకం ఎంచుకుంటే విలువైన భూములు ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న ఏరియాలో ఇస్తామన్నారు. సమావేశంలో వి.వి.సీతారామ్మూర్తి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో నియామకాలు 1
1/2

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

వైఎస్సార్‌సీపీలో నియామకాలు 2
2/2

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement