ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం కల్చరల్ : శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య నెలవారీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు–2025 జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎల్.సూర్యలింగం లక్ష్మీనరసమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో యడ్లపాడుకు చెందిన మానవతా నాటక సంస్థ ఆధ్వర్యంలో జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో ‘అందరూ మంచివారే కానీ’ నాటికను చక్కగా ప్రదర్శించారు. పన్నాల నరసింహమూర్తి, నారాయణమూర్తి, రామకృష్ణ సోదరుల సౌజన్యంతో విజయవాడకు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కె.వి.సత్యనారాయణ రచన, వేంపాటి రమేష్ దర్శకత్వంలో ‘క్రతువు’ నాటిక ఆలోచింపజేసింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, విశ్రాంత ఆర్‌డీఓ పి.ఎం.జె.బాబు, చిట్టి నాగభూషణం, సురంగి మోహనరావు, సమాఖ్య ప్రతినిధులు చిట్టి వెంకటరావు, పన్నాల నర్సింహమూర్తి, ఎల్.రామలింగస్వామి, రామచంద్రదేవ్, కంచరాన అప్పారావు, ఇంజరాపు రమణారావు, బి.ఎ.మోహనరావు, బి.జ్యోతి, సత్యవతి, బి.ఎన్.భూషణ్, మెట్ట వెంకటరావు, పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.


