చదువులు పడకేశాయి
● మెగా పేరెంట్స్ డే పేరిట టీచర్లపై ఒత్తిడి
● ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: బాబు సర్కార్‌లో చదువులు పడకేశాయని, బడులు మూత బడుతున్నాయని, ఇవన్నీ కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం మెగా పేరెంట్స్ సమావేశాలు పేరిట హడావుడి చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమాలు నిర్వహించేందు కు అవసరమైన డబ్బులు ఇవ్వకుండా ఉపా ధ్యాయులే విరాళాలు సేకరించి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం చెప్పడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశాల వల్ల ప్రయోజనం మాట ఎలా ఉన్నా ఉపాధ్యాయు లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని తెలిపా రు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు నాడు–నేడు పేరిట స్కూళ్లను బాగు చేశారని గుర్తు చే శారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని మ ర్చిపోయిందని తెలిపారు. పాఠశాలల్లో మొండి గోడలు కనిపించడం లేదా.. అని ప్ర శ్నించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్కూల్స్‌లో ఆర్వో ప్లాంట్లు గతంలో ఏర్పాటు చేశామని, ఇప్పుడవన్నీ మూలకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పథకాలకు పేర్లు మాత్రమే మారుస్తున్నారని ఎద్దేవా చేశారు.


