సంస్మరణ సభ విజయవంతం చేయండి
పలాస: విప్లవ కవి, శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి సంస్మరణ సభను విజయవంతం చేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరారు. మండలంలోని బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో కరపత్రాలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొడ్డపాడులో ఈనెల 22వ తేదీన పాణిగ్రాహి సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సుబ్బారావు పాణిగ్రాహి తన మొత్తం జీవితాన్ని ప్రజల కోసం ధారబోశారన్నారు. కళాకారుడిగా, రచయితగా, వాయిద్యకారుడిగా, ఆటగాడిగా, పాటగాడిగా విభిన్న పాత్రలను పోషించారన్నారు. ప్రజా కళలను కాపాడుకుందాం, ప్రత్యామ్నాయ ప్రజా సాంస్కృతిని స్థాపిద్దాం అనే నినాదాంతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజాకళా మండలి జిల్లా అధ్యక్షుడు రాపాక చిరంజీవి, సాలిన కుమార్, బుట్ట శ్రీరాములు, శ్రీకాంత్, ప్రజాకళా మండలి రాష్ట్ర సహాయక కార్యదర్శి కొర్రాయి నీలకంఠం, పీకేఎస్ జిల్లా అధ్యక్షుడు పుచ్చ దుర్యోధనరావు, మద్దిల ధర్మారావు, అమరుల బంధుమిత్రుల కమిటీ నాయకుడు జోగి కోదండరావు, సామాజిక కార్యకర్త పోతనపల్లి అరుణ, లిబరేషన్ నాయకుడు మద్దిల రామారావు, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పోతనపల్లి కుసుమ, అమ్మరామకృష్ణ, కై లాస్, దీపు, మురళి తదితరులు పాల్గొన్నారు.


