రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ఎచ్చెర్ల: ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్స్ ఎదురుగా బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అంబేడ్కర్ వర్సిటీ నుంచి శ్రీకాకుళం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు పాలిశెట్టి చందు, చందన గణేష్‌లు పాత జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బైక్ డ్రైవ్ చేస్తున్న గణేష్‌కు తీవ్రగాయాలు, వెనుక కూర్చున్న చందు కాలికి గాయమైంది. వీరిద్దరినీ అంబులెన్స్ ద్వారా శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గణేష్ స్వగ్రామం లావేరు మండంలోని పెద్ద లింగాలవలస, చందుది కొత్తురూ మండలంలోని కుడుమ గ్రామంగా తెలిసింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు


