అంతరాయంతో అవస్థ
● ధాన్యం కొనుగోలు వెబ్‌సైట్ అంతరాయంతో రైతులకు అవస్థలు
● గంటల కొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి
గార: ప్రభుత్వం ఖరీఫ్‌లో పండిన ధాన్యంను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. వీటి కోసం ఏపీ ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ పేరిట వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. రైతు ఆధార్ ద్వారా అప్పటికే ఈ–క్రాప్‌లో నమోదు చేసిన వారు వచ్చి ధాన్యం రెడీ అయ్యాయని చెప్పగానే అదే రోజు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం రైతు సేవా కేంద్రాలు, సచివాలయాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గార మండలంలో 25 పంచాయతీల పరిధిలో 15 సచివాలయాల పరిధిలో 15 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ మంగళవారం ఉదయం 10 గంటలకు వెళ్లిన లింగాలవలస, గొంటి, గార తదితర సచివాలయాల వద్దకు వెళ్లిన రైతులకు ఆన్‌లైన్‌లో టెక్నికల్ సమస్యతో వెబ్‌సైట్ తెరచుకోలేదు. దీంతో మధ్యాహ్నం రెండు వరకు వేచి ఉండి ఇంటికి వెళ్లిపోయారు. జిల్లా అంతటా ఇదే సమస్య ఉందని తెలుస్తోంది. మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత వెబ్‌సైట్ పనిచేయడం ప్రారంభం కావడంతో వచ్చిన రైతులకు మళ్లీ కబురు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ధాన్యం కొనుగోలు కేంద్రం పోర్టల్‌లో టెక్నికల్ సమస్య వచ్చింది. తొలుత ఒక కొనుగోలు కేంద్రంలో వచ్చిందని తెలిసి నిపుణులకు సమాచారమిచ్చాం. అన్ని కేంద్రాల్లో ఇదే సమస్య తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదించాం. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత టెక్నికల్ సమస్య తొలగడంతో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది.
– మునగవలస చక్రవర్తి,
తహసీల్దార్, గార
ఉదయం మా సచివాలయం వద్దకు ఆధార్, ధాన్యం శాంపిల్‌తో వెళ్లాను. అప్పటినుంచి పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. మిగిలిన వాళ్లకి ఫోన్ ద్వారా చెబుతున్నారు. మధ్యాహ్నం వరకు ఉన్నా పనికాలేదు. నాకు చెందిన 140 ధాన్యం బస్తాలు అమ్మేందుకు వచ్చాను. – పెదలాపు లక్ష్మీనారాయణ, రైతు,
లింగాలవలస
అంతరాయంతో అవస్థ
అంతరాయంతో అవస్థ


