అసంపూర్తి భవనాలకు నిధులు మంజూరు
కంచిలి : కంచిలిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.65 లక్షలు నిధులు మంజూరుకు తక్షణమే జీఓ జారీ చేస్తున్నట్లు రాష్ట్ర గురుకుల సొసైటీ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్‌కుమార్ వెల్లడించారు. సోమవారం కంచిలి గురుకులంలో ఆయన పర్యటించారు. ఇక్కడి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘చలించదా..?’ అనే శీర్షికన నవంబర్ 21న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించారు. ఇప్పటికే పలువురు అధికారులు పర్యటించి ఆరా తీశారు. తాజాగా నాబార్డు భవనాలు పూర్తి చేయడానికి రూ.35లక్షలు, నాడు–నేడు భవనాలను పూర్తి చేయడానికి రూ.30లక్షలు మంజూరుకు అంచనాలు రూపొందించాలని ఇంజినీరింగ్ శాఖకు ఆదేశించారు. పాడైన డార్మిటరీ స్థానంలో కొత్త డార్మిటరీ నిర్మాణానికి రూ.4.5 కోట్లతో ఎస్టిమేషన్ తయారుచేసి పంపించాలని గురుకుల ప్రిన్సిపాల్ పి.శ్రీనివారావును ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గురుకులాల సమన్వయాధికారి వై.యశోద లక్ష్మి, సిబ్బంది ఉన్నారు.
అసంపూర్తి భవనాలకు నిధులు మంజూరు


