ధాన్యం కుప్పకు నిప్పు
మెళియాపుట్టి: జాడుపల్లి గ్రామంలో కలమట సూర్యనారాయణ అనే రైతుకు చెందిన అర ఎకరా ధాన్యం కుప్పకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఆదివారం అర్ధరాత్రి కుప్ప కాలిపోవడం చూసి రైతుకు గ్రామస్తులు సమాచారం అందించడంతో వెళ్లి చూసేసరికే బూడిదైపోయింది. అనంతరం పలాస అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు.
ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 11 నుంచి జిల్లా యువకులకు సీసీటీవీ కెమెరా ఇన్‌స్టలేషన్‌లో 13 రోజుల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని సంస్థ డైరెక్టర్ రామ్‌జీ సోమవారం తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 7993340407, 9553410809 నంబర్లను సంప్రదించాలని కోరారు.


