శోధించి.. ఛేదించిసీసీఎస్‌.. దొంగలపాలిట సింహస్వప్నంలా మారుతోంది. 129 కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించింది. –8లో | - | Sakshi
Sakshi News home page

శోధించి.. ఛేదించిసీసీఎస్‌.. దొంగలపాలిట సింహస్వప్నంలా మారుతోంది. 129 కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించింది. –8లో

Dec 2 2025 7:44 AM | Updated on Dec 2 2025 7:44 AM

శోధిం

శోధించి.. ఛేదించిసీసీఎస్‌.. దొంగలపాలిట సింహస్వప్నంలా మా

శోధించి.. ఛేదించిసీసీఎస్‌.. దొంగలపాలిట సింహస్వప్నంలా మారుతోంది. 129 కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించింది. –8లో

కంచిలి: కోసిన పంటను యంత్రాల సహాయంతో

నూరుస్తున్న రైతులు

వజ్రపుకొత్తూరు రూరల్‌: నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలిస్తున్న రైతు సంఘ నాయకులు

రణస్థలం: తాళ్లవలసలో వరికుప్పలకు టార్పాలిన్లు కప్పుతున్న రైతులు

మబ్బు పట్టిన ఆకాశం రైతు గుండెల్లో గుబులు రేపుతోంది. ప్రతి చినుకు అన్నదాతకు వణుకు పుట్టిస్తోంది. గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం, ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతుండడం, తేమ శాతం పెరుగుదలపై ఆందోళన పెరగడంతో కర్షకుడికి ఆఖరికి దళారీలే దిక్కుగా మారుతున్నారు. తక్కువ ధరకై నా ధాన్యం ఇచ్చేద్దామన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

న్నదాతను ప్రకృతి భయపెడుతోంది. పండిన పంట తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే, వర్షాలతో జాగ్రత్తగా దాచుకోండని పాలకులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రకటనలతో అధికారులు చేతులుదులుపుకుంటే.. తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. పైగా తేమ శాతం 17కు మించకుండా ఆరబెట్టుకోవాలని ఉన్నతాధికారులు సెలవిస్తుండడంతో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.

పంట విక్రయించే సమయంలో వాన పడటంతో ధాన్యం తడిసి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ మండకొడిగా సాగుతుండగా దీనికి తోడు వర్షాలు తోడై ధాన్యం తడిసిపోతున్నాయి. ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించేందుకు రైతులు రోడ్లుపైన, చేల వద్ద, కళ్లాల్లోను ఆరబెట్టారు. తాజాగా వర్షా లు పడుతుండటంతో ఆరబెట్టిన ధాన్యం తడుస్తోంది. ఽకొన్నిచోట్ల ధాన్యంపై టార్పాలి న్‌ కవర్లు కప్పారు. కొందరు రైతులకు టార్పాలిన్లు లేకపోవడంతో అలాగే వదిలేశారు. తేమ శాతం తగ్గాలని ఆరబె ట్టేందుకు సిద్ధమవుతున్న వేళ ఆ ధాన్యం తడవడంతో గగ్గోలు పెడుతున్నారు.

చెప్పేదొకటి.. కనిపించేదొకటి

కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యల్లేవని, రైతులకు సరిపడా సంచులు, లారీలు ఉన్నాయంటూ ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలో కొనుగోళ్లు కనీసం జరగడం లేదు. నెమ్మదిగా సాగుతున్నాయి. లారీలు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో రైతులు ధాన్యం విక్రయించడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. జిల్లాలోని రైతులకు 80 లక్షల వరకు గోనె సంచెలు కావాలి. వారం రోజుల కిందటి వరకు ఒక్క గోనె సంచి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం 40లక్షల గోనె సంచులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 12లక్షల గోనె సంచులు కొనుగోలు కేంద్రాలకు పంపించామని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎన్ని రైతుల వద్దకు చేరాయో ఎవరికీ తెలీదు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు 264మిల్లులకు ట్యాగ్‌ చేశారు. ట్యాగ్‌ చేసిన మిల్లులన్నీ ధాన్యం వచ్చేలోపు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలి. ఇప్పటివరకు 188మంది మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారు. వీరిలో అత్యధికం మూడు నాలుగు రోజుల్లో ఇచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో ఏడు వేల వరకు టార్పాలిన్లు అవసరం ఉండగా, గత ఏడాదికి చెందిన 3వేల టార్పాలిన్‌లతో పాటు మరో 1200 టార్పాలిన్‌లు సిద్ధం చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవి కూడా రైతుల వద్దకు వెళ్లలేదు. కేంద్రాల్లో ఉన్నాయని చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.

నరసన్నపేట: పోతయ్యవలస కూడలి వద్ద రోడ్డుపై ఉన్న ధాన్యం నిల్వలను పరిశీలిస్తున్న రైతు (ఇన్‌సెట్లో) దేవాది సర్వీసు రోడ్డులో తడిచిన ధాన్యాన్ని చూపుతున్న రైతు

గతంలో ఇలా..

కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ముందుకు రావడం లేదు. క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో ఎవరూ మాట్లాడలేదు. గత ప్రభుత్వంలో వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వమే నేరుగా రైతుల వద్దకు వెళ్లి, అక్కడికక్కడే ఆన్‌లైన్‌ చేసి, ట్రక్‌షీట్‌ జనరేట్‌ చేసి కొనుగోలు చేసేది. రైతులకు నష్టమనే మాట ఉండేది కాదు. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. వర్షాలకు భద్రంగా దాచుకోవాలన్న సూచనలు తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వంపై నమ్మకం లేక, వర్షాలకు పంటను కాపాడుకోలేక దళారులకు తక్కువ ధరకు విక్రయించుకోక తప్పడం లేదు.

నెమ్మదిగా కొనుగోళ్లు

జిల్లాలో 406 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా సోమవారం ఉదయానికి 230 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచారు. వర్షాల నేపథ్యంలో సాయంత్రానికి మరో 73 కేంద్రాలు తెరిచారు. అక్టోబర్‌కే చాలా చోట్ల కోతలు జరిగి, ధాన్యం విక్రయానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొనుగోళ్లు చేయలేదు. అక్టోబర్‌ 13న పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ జిల్లాకొచ్చి సమీక్ష నిర్వహించి, తక్షణమే కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ, ఆయన చెప్పిన మాటలు దాదాపు 50 రోజులు దాటినా కార్యరూపం దాల్చలేదు. మొత్తానికి రైతుల వద్ద 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అందుబాటులో ఉండగా, ప్రభుత్వం లక్ష్యం 6.50లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇంతవరకు 48,905మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.

అవస్థలు పడుతున్న అన్నదాతలు

భయాందోళనకు గురి చేస్తున్న వర్షాలు

ధాన్యం దాచుకోవడానికి నానా కష్టాలు

సర్కారు నిర్లక్ష్యంతో నెమ్మదిగా కొనుగోళ్లు

తేమ శాతం పెరుగుతుందని ఆందోళన

శోధించి.. ఛేదించిసీసీఎస్‌.. దొంగలపాలిట సింహస్వప్నంలా మా1
1/3

శోధించి.. ఛేదించిసీసీఎస్‌.. దొంగలపాలిట సింహస్వప్నంలా మా

శోధించి.. ఛేదించిసీసీఎస్‌.. దొంగలపాలిట సింహస్వప్నంలా మా2
2/3

శోధించి.. ఛేదించిసీసీఎస్‌.. దొంగలపాలిట సింహస్వప్నంలా మా

శోధించి.. ఛేదించిసీసీఎస్‌.. దొంగలపాలిట సింహస్వప్నంలా మా3
3/3

శోధించి.. ఛేదించిసీసీఎస్‌.. దొంగలపాలిట సింహస్వప్నంలా మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement