సెగ తగిలింది మాట మారింది
కూన అబ్బా!
● మాట మార్చిన
ఆమదాలవలస ఎమ్మెల్యే
● ఉద్ధృతమైన పవర్ ప్లాంట్
వ్యతిరేక ఉద్యమం
● ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను నిలదీసిన ఆదివాసీలు
● ఊహించని విధంగా
నిలదీయడంతో తన
ప్రమేయమేదీ లేదని దాటవేత
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ఆమదాలవలస నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది నా ఆశయం దాని కోసం థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నాను. గడిచిన శాసన సభ్యునిగా ఎన్నికై న దగ్గరి నుంచి నా కోరిక ఇది. అసలు పొల్యూషన్ ఎక్కడ ఉండదు. అన్నిచోట్లా ఉంటుంది. కానీ జాగ్రత్తలు తీసుకుని ప్లాంట్ ఏర్పాటు చేసేలా చూస్తాం. స్యూటిబులిటీ కోసం పరిశీలన జరిగింది. అంతా ఓకే అయితే ప్లాంట్ ఏర్పాటు చేసి తీరుతాను. ఎవరు అడ్డుకున్నా ఆగదు. – ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తరుచూ చెప్పె మాటలివి.
వెనుకబడిన ఆమదాలవలస నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని ఎన్నో సార్లు కూన చెప్పారు. అసలక్కడ గిరిజనులు ఎక్కడున్నారని అన్నారు. ఆ ప్రాంతంలో సాగు ఎక్కడన్నారు. కాలుష్యానికి తావే లేదని కూడా చాలాసార్లు చెప్పారు. వీటిలో చాలా వాటికి వీడియోలు కూడా ఉన్నాయి. కానీ ఆయన ఇప్పుడొక్కసారిగా మాట మార్చేశారు. సోమవారం పింఛన్లు పంపిణీ చేద్దామని వెళ్లేసరికి అక్కడ గిరిజనులంతా పవర్ ప్లాంట్ నిర్మాణం నిలుపుదల చేస్తే తప్ప పింఛన్లు తీసుకోమని మొండికేసి నిలదీయడంతో తప్పించుకున్న వాడు ధన్యుడు సుమతి అన్నట్టు తానేమీ ప్రతిపాదించలేదని తప్పించుకున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించి మా పొట్టలు కొట్టొద్దని నిలదీసేసరికి ఆ ప్రతిపాదన తనది కాదని ప్రభుత్వంపై తోసేశారు. ప్రభుత్వం ఒకటి, తానొకటి అన్నట్టుగా సమర్థించుకున్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలన్నీ తప్పు అనేలా తేల్చి పారేశారు.
జిల్లాలో కూన రవికుమార్ వైఖరి చాలా వివాదాస్పదంగా మారుతోంది. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ వేధింపుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకు దారితీసింది. ఇసుక అక్రమాలు, ఆయన అనుచరుల దౌర్జన్యం రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. తాజాగా మద్యం కల్తీ చేసిన షాపు యజమాని ఆయన అనుచరుడు కావడంతో చర్చనీయాంశమైంది. చివరికి జెడ్పీలో మంత్రులను, అధికారుల నిలదీసే విధంగా మాట్లాడిన వ్యవహారం రచ్చకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకోవడం, పరుషంగా మాట్లాడటం, అక్రమాల్లో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంపై ఆరోపణలు రావడం, భూముల ఆక్రమణలో ఆయనపై విమర్శలు రావడం, ఇలా ప్రతీది ఆయన చుట్టూ జరుగుతోంది. చివరికి ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో ఏర్పాటు చేయబోతున్న థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలోను టార్గెట్ అయ్యారు. దానికంతటికీ పవర్ ప్లాంట్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం.
తాడోపేడో తేల్చుకునే పనిలో బాధితులు
ఆందోళనలు చేస్తున్నా, నిరసన స్వరం విన్పిస్తున్నా ప్రభుత్వం లెక్క చేయకుండా రహస్య సర్వేలు చేయడంతో బాధితులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వంతో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. గతంలో థర్మల్ పవర్ ప్లాంట్‌కు సానుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ ముందు నిరసనకు దిగారు. తీవ్ర నిరసన స్వరం వినిపించారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు వచ్చిన ఆయన్ని గిరిజనులంతా నిలదీశారు. ఇందులో తన తప్పేమీ లేదని నచ్చ చెప్పుకోవాల్సి వచ్చింది.
థర్మల్ రద్దు చేశాకే రండి..
బూర్జ, సరుబుజ్జిలి మండలాల పరిధిలోని అన్నంపేట, బొడ్లపాడు, జంగాలపాడు, మసానపుట్టి, జేవీ పురం, బసిమామిడివలస, వెన్నెలవలస గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దీంతో అన్నిచోట్లా గిరిజనులు ఎమ్మెల్యేను అడ్డుకుని నిలదీశారు. తమ భూములు, తమ బతుకులు లాక్కుని పింఛన్ల పంపిణీ కోసం మా గ్రామాలకు ఎలా వచ్చారని ఎమ్మెల్యేను ప్రశ్నించి పింఛన్లు తీసుకోవడానికి నిరాకరించి నిరసనలు తెలిపారు. థర్మల్ ప్లాంట్ రద్దు చేసి మాత్రమే తమ గ్రామాలకు రావాలన్నారు.
భయాందోళనలో గిరిజనులు..
సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. రూ.30వేల కోట్లతో 1500 ఎకరాలకు పైగా 3200 మెగావాట్ల థర్మల్ క్రిటికల్ సూపర్ ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించాలని చూస్తోంది. సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో బొడ్లపాడు, జె.విపురం, అనంతగిరిపేట, వెన్నెలవలస 1, వెన్నెలవలస–2, గోపిదేవిపేట, మసానపుట్టి, బూర్జ మానుగూడ, జంగాలపాడులో రెండు విడతల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే సుమారుగా 18 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగం జరగనుండగా, సుమారు 12టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. కోటి 40లక్షల లీటర్ల మేర హైస్పీడ్ డీజిల్ కావాల్సి ఉంటుందని ఆందోళనకారులు చెబుతున్నారు. ప్లాంట్ కోసం భూములను కోల్పోవడమే కాకుండా 20 గ్రామాల మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆందోళనలు ఉద్ధృతమవుతుంటే యు వత ఉపాధి కోసం పవర్ ప్లాంట్ పెట్టి తీరుతామని, అభివృద్ధిని అడ్డుకుంటే అంతు చూస్తామ ని పాలక పక్షం నుంచి బెదిరింపులు వస్తున్నాయి. నాడు జరిగిన సోంపేట, కాకరాపల్లి థర్మల్ ప్లాంట్లు వేరు, అక్కడ పరిస్థితులు వేరు, ప్పుడు ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ వేరు, ఇక్కడ పరిస్థితులు వేరని సమర్థిస్తూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. నిరసనలు తెలియజేస్తున్నారు. బహిరంగ సభలు పెట్టి తమ ఆవేదన తెలియజే శారు. నిరసన ర్యాలీలు చేస్తున్నారు. రోజురోజుకి ఉద్యమం ఉద్ధృతమవుతోంది.
థర్మల్ దెబ్బ


