జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు మడపాం విద్యార్థిని
నరసన్నపేట: మడపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జి.లోకేశ్వరి స్కూల్ గేమ్స్ కబడ్డీ విభాగంలో జాతీ య స్థాయికి ఎంపికై ంది. రాష్ట్ర స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపింది. జనవరి నెలలో విజయవాడలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఏపీ కబడ్డీ టీమ్‌కు ఎంపికైంది. ఈ మేరకు స్కూల్ హెచ్‌ఎం యు.భారతి, పీడీ బీ. లక్ష్మణరావు తెలిపారు. అండర్ 14 విభాగంలో జిల్లా కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా లోకేశ్వరి వ్యవహరించందన్నారు.
‘చంద్రబాబు రైతు ద్రోహి’
సారవకోట: చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. సోమవారం ఆయన మండలంలోని అలుదు వీబీఆర్ కల్యాణ మండపంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నట్టేట ముంచేసిందన్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకపోవడంతో రై తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మిర్చి, పొగాకు, టమాటా, అరటి తదితర పంటలను రైతులు పండించి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులే నాశనం చేసుకునే దుస్థితి దాపురించిందని తెలిపారు. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ఇప్పటి ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ పరం చేసేందుకు సన్నాహాలు చేస్తుందని, దీని కోసం పార్టీ తరఫున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని, దీని ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు.
5న ‘మెగా పీటీఎం 3.0’
శ్రీకాకుళం పాతబస్టాండ్: మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్–3.0ను ఈ నెల 5న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తరఫున తల్లిదండ్రులు హాజరై పిల్లల భవిష్యత్తుపై ఉపాధ్యాయులతో ముఖాముఖి చర్చించాలన్నారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలు, కళాశాలల్లో ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు మడపాం విద్యార్థిని


