వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
● జిల్లా వ్యవసాయ అధికారి కె.త్రినాథస్వామి
జలుమూరు: వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, కళ్లాలకు చేరిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కె.త్రినాథస్వామి అన్నారు. ఆయన సోమవారం చల్లవానిపేట, లింగాలవలస, జలుమూరులో పర్యటించి రైతులతో మాట్లాడారు. వరికుప్పల్లోకి వర్షం నీరు దిగకుండా చూసుకోవాలన్నారు. తడిచిన వాటిపై ఉప్పు ద్రావణం వేయాలన్నారు. చల్లవానిపేట మిల్లులో తనిఖీ చేసి నాణ్య త, తేమ శాతం పరిశీలించారు. కొందరు రైతులు మాట్లాడుతూ మిల్లర్లు వారి సొంత మీటర్లు ద్వారా తేమ శాతం చూస్తున్నారని ఈయన దృష్టికి తెచ్చారు. బస్తాకు అదనం ధాన్యం తీసుకుంటే చర్యలు తప్పవన్నారు.


