లావేరులో పురిల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

లావేరులో పురిల్లు దగ్ధం

Dec 1 2025 7:36 AM | Updated on Dec 1 2025 7:38 AM

ఇంతేనా వీరు.. మారదా తీరు..?

రణస్థలం: లావేరు గ్రామానికి చెందిన నడుపూరి ఏసురత్నం పురిల్లు అదివారం తెల్లవారుజామున విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. వెంటనే గుర్తించిన బాధితులు రణస్థలం అగ్నిమాపక వాహనానికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిళ్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఎస్టీయూ జిల్లా ప్రధాన

కార్యదర్శిగా గురువు

శ్రీకాకుళం: నగరంలోని దాసరి క్రాంతి భవన్‌లో ఎస్వీ రమణమూర్తి అధ్యక్షతన ఎస్టీయూ వార్షిక కౌన్సిల్‌ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. జిల్లా అధ్యక్షుడిగా పేడాడ ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శిగా గురువు శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శిగా కంచరాన తేజేశ్వరరావులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి డి.శ్యామ్‌ వ్యవహరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచినా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వాపోయారు. అనంతరం సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని, 12వ పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలని తీర్మానించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌: కోటబొమ్మాళిలోని ఎత్తురాళ్లపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు మృత్యువాత పడినప్పటికీ ఇటు పోలీసులు తీరుగానీ, అటు వాహనదారుల తీరుగానీ మారడం లేదు. ఎప్పటిలాగే రోడ్లపైనే గంటల తరబడి వాహనాలు నిలిపివేస్తున్నారు. ఎత్తురాళ్లపాడు ఘటన జరిగాక కూడా జిల్లాలో ప్రమాదాలు పెరిగాయి. ఆమదాలవలస ఫ్‌లై ఓవర్‌ వంతెన వద్ద కొబ్బరికాయల లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం ప్రమాదంలో కొడుకు ముందే కన్నతల్లి మృత్యువాత పడింది. పలాస మండలం గరుడఖండి పాత జాతీయ రహదారిపై ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కవిటి మండలం ఆర్‌.కరాపాడు టోల్‌గేట్‌ వద్ద దాబాలో పనిచేస్తున్న వ్యక్తిని భారీ వాహనం ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. కేవలం నవంబర్‌ నెలలోనే 16 మందికి పైగా చనిపోయారు. ఈ పరిస్థితుల్లో రోడ్లపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ మేరకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విద్యార్థులకు హిందీపై అభిరుచి పెరగాలి

శ్రీకాకుళం: విద్యార్థులకు హిందీ సబ్జెక్టుపై అభిరుచి పెంచేందుకు హిందీ ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తున్నామని హిందీ మంచ్‌ గౌరవాధ్యక్షుడు దొంతం పార్వతీశం అన్నారు. శ్రీకాకుళంలో 80 ఫీట్‌ రోడ్‌లోని బీకేఎస్‌ జూనియర్‌ కళాశాలలో హిందీ మంచ్‌ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హిందీ సిలబస్‌పై హిందీ సేవా సదన్‌ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందీ ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభా పరీక్షలను నిర్వహించి, విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు, పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి టాపర్స్‌కు మెడల్స్‌, నగదు బహుమతులను ప్రదానం చేయనున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచిన టాపర్స్‌కు హిందీ ప్రతిభా రత్న అవార్డుతో సన్మానం చేయనున్నట్లు తెలిపారు. టాలెంట్‌ టెస్ట్‌కు ఉత్తరాంధ్ర జిల్లాల సంయోజక్‌గా కోనే శ్రీధర్‌ను నియమించామన్నారు. సమావేశంలో కె.సత్యం, ఆర్‌.రామారావు, ఎస్‌.రాధ తదితరులు పాల్గొన్నారు.

లావేరులో పురిల్లు దగ్ధం 1
1/3

లావేరులో పురిల్లు దగ్ధం

లావేరులో పురిల్లు దగ్ధం 2
2/3

లావేరులో పురిల్లు దగ్ధం

లావేరులో పురిల్లు దగ్ధం 3
3/3

లావేరులో పురిల్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement