అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం
శ్రీకాకుళం అర్బన్: నగరంలోని ఏపీ ఎన్‌జీవో కార్యాలయంలో ఏపీ హియరింగ్ హ్యాండీక్యాప్డ్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవంగా ఆదివారం జరిగింది. ఈ ఎన్నికలకు ఏపీ ఎన్‌జీవో సంఘ జిల్లా కోశాధికారి బడగల పూర్ణచంద్రరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా.. సైన్ లాంగ్వేజ్ ఇంటర్ర్‌పిటర్ నర్మజ సహకారం అందించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఉద్యోగస్తులంతా సంఘటితంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. సంఘ ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
నూతన కార్యవర్గం
ఏపీహెచ్‌హెచ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా యు.ప్రసాద్ (సెకండరీ హెల్త్ డిపార్ట్‌మెంట్), కార్యదర్శిగా జి.రవిశంకర్ నాగ్ (రిమ్స్ శ్రీకాకుళం), ఉపాధ్యక్షులుగా ఎ.అశోక్ కుమార్ (ఓఎస్ బీసీ వెల్ఫేర్), జి.శ్రీనివాసరావు (ఓఎస్ ఐసీడీసీ శ్రీకాకుళం), ఆర్గనైజేషన్ సెక్రటరీగా కె.తరుణ్ కుమార్ (టైపిస్ట్ కలెక్టరేట్ శ్రీకాకుళం), కోశాధికారిగా ఎస్.సాయికృష్ణ (టైపిస్ట్ ఎంపీడీవో కార్యాలయం ఎల్‌ఎన్‌పేట), జాయింట్ సెక్రటరీగా కె.వి.గౌతమ్ (పీఎస్‌వీఐ డిజిటల్ అసిస్టెంట్ గ్రామ పంచాయతీ టెక్కలి), ఉమెన్ సెక్రటరీగా ఎన్.దివ్యశ్రీ (ఎల్డీసీ, పీహెచ్‌సీ ఆమదాలవలస), ఎగ్జిక్యూటివ్ ఈసీ మెంబర్ ఉమెన్ జి.లక్ష్మి(కుక్, గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ శ్రీకాకుళం), ఈసీ మెంబర్1, 2గా ఎ.త్రినాథరావు (ఆఫీస్ సబార్డినేట్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆమదాలవలస), ఎం.బాలరాజు (ఓఎస్ ఎంపీడీవో ఆఫీస్ సారవకోట) ఎంపికయ్యారు.


