ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
సారవకోట: మండలంలోని చిన్నగుజ్జువాడ గ్రామానికి సమీపంలో ఆదివారం ట్రాక్టర్ బోల్తాపడి అలుదు గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బల్లా లక్ష్మణరావు (33) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేళవలస నుంచి సారవకోట మీదుగా కొమ్ముసరియాపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్ గ్రామానికి సమీపంలో ఉన్న మలుపు దగ్గర అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ క్రింద ఉండి మృతి చెందాడు. స్ధానికులు స్పందించి ట్రాక్టర్‌ను తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ అనిల్‌కుమార్ పరిశీలించి శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు. మృతుడికి భార్య నీలవేణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
పడవ బోల్తాపడి మత్స్యకారుడు మృతి
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పక్కలపేట గ్రామానికి చెందిన గనగళ్ల తోటయ్య (57) చేపల వేటకు వెళ్లి ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సముద్రంలో వేట చేస్తుండగా ఒక్కసారిగా తెప్ప బోల్తా పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి


