శిక్షల్లో కొన్ని.. | - | Sakshi
Sakshi News home page

శిక్షల్లో కొన్ని..

Dec 1 2025 7:20 AM | Updated on Dec 1 2025 7:20 AM

శిక్ష

శిక్షల్లో కొన్ని..

శిక్షల్లో కొన్ని.. ●

మొత్తం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌,

ఓపెన్‌ డ్రింకింగ్‌ కేసులు

గణాంకాలు ఇలా..

జిల్లాలో రహదారి భద్రతను మెరుగుపర్చడం, ప్రమాదాలను తగ్గించడం, బహిరంగంగా మద్యం సేవించి పబ్లిక్‌ న్యూసెన్సు చేసే వారిని అరికట్టే దిశగా కఠిన చర్యలు చేపట్టినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు 2025 ఏడాదికిగాను ఇప్పటివరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌ కేసులకు సంబంధించి గణాంకాలను ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు.

17,509

నేరారోపణ రుజువై జైలు

శిక్ష పడిన కేసులు

28

వీటిల్లో 2 నెలలు ఒక కేసు, 45 రోజులు ఒక కేసు, నెల రోజులు 8 కేసులు, 20 రోజులు 4 కేసులు, 10 రోజులు 2 కేసులు, 7 రోజులు 11 కేసులు, 2 రోజులు ఒక కేసులో శిక్షలు పడ్డాయి.

న్యాయస్థానం విధించిన మొత్తం

జరిమానా (డిస్పోజల్‌)లు :

జైలుకు పంపుతున్నాం..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఓపెన్‌ డ్రింకింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో జైలుకు పంపుతున్నాం. ఎన్ని రోజులు శిక్ష అన్నది ముద్దాయి చేసే న్యూసె న్సు, న్యాయమూర్తి విచక్షణాధికారాన్ని బట్టి ఆధార పడి ఉంటుంది. పోలీసుల ప్రమేయమేమీ ఉండదు. జిల్లాలో అన్ని చోట్లా కేసులు కడుతున్నాం. జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే ప్రయత్నంలో వాహనదారులపై కేసులు కట్టి అధికంగా చలానాలు విధిస్తున్నాం. విధుల్లో ఉన్న సిబ్బందిపై తిరగబడిన వారిపై కఠిన చర్యలుంటాయి. అలాంటివారిపై జాలి ఉండదు.

– కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం

8,594

అన్ని కేసులకు మొత్తం జరిమానా సొమ్ము : రూ. 38,16,555

రూ. 10 వేలు జరిమానాకు గురైన కేసులు

113

అడుగుకో బెల్టు షాపు, మలుపునకో మద్యం షాపుతో ఊళ్లు నిత్యం మత్తులో జోగుతున్నాయి. సర్కారు వారి సంపద సృష్టి కోసం సామాన్యులు సమిధలైపోతున్నారు. పొద్దంతా కష్టపడి వచ్చిన కూలి డబ్బును బెల్టుషాపు గల్లా పెట్టెలో పోసి ఓ సామాన్యుడు పోలీసులకు దొరికిపోతున్నాడు. విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంపై నుంచి దృష్టి మరల్చలేక మరో సగటు జీవి కటకటాలపాలవుతున్నాడు. పూటుగా తాగి పోలీసులకు దొరికిపోతున్న మందుబాబులు సంపాదనలో సగం డబ్బును మద్యం షాపులకు మిగిలిన డబ్బును జరిమానాలకు కట్టేసి ఇంటికి ఖాళీ జేబులు చూపిస్తున్నారు. పైగా పోలీసులతోనే తగువులకు దిగుతున్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌ :

రవై ఎనిమిది మందికి జైలు శిక్ష.. వీరంతా మద్యం తాగి పోలీసులకు దొరికిన వారే. 113 కేసుల్లో రూ.10వేల చొప్పున జరిమానా. వీరు కూ డా మద్యం ప్రియులే. ప్రభుత్వం ప్రతి మలుపులోనూ మద్యం దొరికేలా ‘జాగ్రత్తలు’ తీసుకోవడంతో మందుబాబులు అటు ఒళ్లు గుల్ల చేసుకుంటూ ఇటు జేబులకు కూడా చిల్లు పెట్టుకుంటున్నారు. కూటమి పాలనలో మద్యం విచ్చలవిడిగా దొరుకు తోంది. ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న బెల్టుషాపులే అందుకు నిదర్శనం. ప్రైవేటు లైసెన్సు దుకాణాల్లోనే కాక ఉదయం 6 గంటల నుంచే కొన్ని చోట్ల బార్లు తెరవడం, గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ బెల్టుషాపులు వెలియడంతో మందుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాగిన మత్తులో దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు జరిగిన వైనాలు ఎన్నో వెలుగు చూశాయి. అంతేకాక రహదారి నియమనిబంధనలు ఉల్లంఘించి మితి మీరిన వేగంతో ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసులెవరైనా తనిఖీ చేస్తే వీరి హంగామా మామూలుగా ఉండడం లేదు.

ఒకటో పట్టణం.. ఒకటో నంబర్‌

జిల్లావ్యాప్తంగా చూసుకుంటే సగానికి పైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో శిక్షలు పడింది శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే. ఇక్కడ గంజాయి బ్యాచ్‌లు, మందుబాబులు నిత్యం గొడవలు, దొ మ్మీలు చేస్తూ నిత్యం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడి ఎస్‌ఐ ఎం.హరికృష్ణ 19 మందికి పైగా మందుబాబులను ఓపెన్‌ డ్రింకింగ్‌ పేరిట కేసులను కట్టి జైలుకు పంపి కట్టడి చేశారు. 2 రోజులు, వారం, 14, 15, 20, నెల, 45 రోజులు ఇలా మందుబాబులు చేసే న్యూసెన్సు బట్టి న్యాయమూర్తి శివరామకృష్ణ జైలు శిక్షలు ఖరారుచేశారు. టూటౌన్‌లో సీఐ ఈశ్వరరావు నలుగురిపై ఓపెన్‌ డ్రంక్‌ కేసులు కట్టి జైలుకు పంపారు. ఇక ట్రాఫిక్‌ పీఎస్‌ పోలీసులైతే 354 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు కట్టి ఆరుగురిని జైలుకు పంపారు.

పూటుగా తాగి పోలీసులకు చిక్కుతున్న మందుబాబులు

తనిఖీ చేసే లోపే హడావుడి చేస్తున్న వైనం

న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్న పోలీసులు

విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యమే కారణం

మద్యం సేవించి వాహనం నడిపినందుకు టెక్కలి పీఎస్‌ పరిధిలో నమోదైన 10 కేసుల్లో కొల్లి సీతయ్య, రాజు చౌదరి, కొర్నాన దుర్యోధన, మట్ట మోహనరావు, అంబటి జోగారావు, సిర్ల ప్రసాద్‌, తెంబూరు సోమేశ్వరరావు, సన పల రామారావు, కొమటూరు భాస్కరరావు, దుప్పలపూడి శంకరరావులకు కోర్టు ఒక్కొక్కరికీ రూ. 10 వేలు జరిమానా విధించింది. అంతకుముందు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన పసుపురెడ్డి నరేష్‌, అట్టాడ నాగరాజులకు ఇలాంటి శిక్షే అమలు చేశారు.

జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద వన్‌వే ఉల్లంఘన– ప్రమాదకర డ్రైవింగ్‌తో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన ఎన్ని శ్రీనివాసరావుకు 7 రోజులు జైలు శిక్ష పడింది.

ఇటీవల చినబరాటం వీధిలో మద్యం సేవించి హల్‌ చల్‌ చేసిన పాత నేరస్తుడు జొన్నా రవికుమార్‌కు 30 రోజులు జైలు శిక్ష పడింది.

వాంబేకాలనీ రోడ్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ముంజేటి రవిమోహన్‌కు నెల రోజుల జైలు శిక్ష పడింది.

అరసవల్లి మిల్లు జంక్షన్‌ వద్ద బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి ప్రజలను ఇబ్బందిపెట్టినందుకు కాగన గణే ష్‌కు నెల రోజుల జైలు శిక్ష పడింది.

కాశీబుగ్గ హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు విధులకు ఆటంకపరిచి దాడిచేసిన కేసులో బోసి రాంబాబు అనే వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష పడింది.

శిక్షల్లో కొన్ని.. 1
1/3

శిక్షల్లో కొన్ని..

శిక్షల్లో కొన్ని.. 2
2/3

శిక్షల్లో కొన్ని..

శిక్షల్లో కొన్ని.. 3
3/3

శిక్షల్లో కొన్ని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement