శ్రీకూర్మనాథాలయ ఈఓగా వాసుదేవరావు
గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మం శ్రీకూర్మనాథాలయ ఆలయ కార్యనిర్వహణాధికారిగా తలగాన వాసుదేవరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పాతపట్నం నీలమణిదుర్గ ఆలయం, స్థానిక మూడు దేవాలయాల ఈఓ గా, మెళియాపుట్టి రాధాగోవిందస్వామి ఆలయం ఈఓగా పనిచేస్తూనే అదనంగా ఇక్కడ ఈఓ బాధ్యతలను దేవదాయ ధర్మాదాయశాఖ అప్పగించింది. ఇప్పటివరకు పనిచేసిన కోట నరసింహనాయుడు బదిలీపై మాతృశాఖ అయిన రాష్ట్ర పురావస్తుశాఖకు వెళ్లారు.
‘ఉద్యోగోన్నతి పొందకుండా మిగిలిపోయాం’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : గడిచిన 13 ఏళ్లుగా ఉద్యోగోన్నతి పొందని వీఆర్వోల బ్యాచ్‌లుగా 2012, 2014 బ్యాచ్‌లు మిగిలిపోయాయని ఇది చాలా బాధాకరమని ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంస్థ వీఆర్వో అసోసియేషన్ అధ్యక్షులు డబ్బీరు రాజేష్‌కుమార్ అన్నారు. ఆదివారం అసోసియేషన్ సభ్యులతో నగరంలో సమావేశం నిర్వహించారు. 90 మంది వీఆర్వోలు సీనియర్ అసిస్టెంట్ స్కేల్ దాటారని, ఉద్యోగోన్నతి వన్‌టైం సెటిల్మెంట్‌గా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికభారం ఉండదని, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉండదన్నారు.
ఇంద్ర ఏసీ బస్సు చార్జీలు తగ్గింపు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం నుంచి విజయవాడ మార్గంలో తిరిగే ఇంద్రా ఎ/సి బస్సు చార్జీలు తగ్గింపును డిసెంబరు నెల 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు. శ్రీకాకుళం–విజయవాడ మార్గంలో నడిపే ఇంద్రా ఎ/సి బస్సుల చార్జీలు 20 శాతం మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ తగ్గింపు 1 డిసెంబరు నుంచి 31 డిసెంబరు వరకు అమ లులో ఉంటుందన్నారు. ప్రస్తుత చార్జీ రూ. 928 నుంచి కొత్తగా నిర్ణయించిన ధర రూ.743 అవుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి ప్రతి రోజు సాయంత్రం 6గంటలకు (సర్వీసు నంబర్ 2967), విజయవాడ నుంచి ప్రతి రోజు రాత్రి 7.15 గంటలకు (2968) బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. దూరప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలీసుల వలయంలో చెల్లూరి నారాయణ..?
● సోషల్ మీడియా ప్రచారంతో ఉలిక్కిపడిన ఉద్దానం
వజ్రపుకొత్తూరు రూరల్: బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్ పోలీసులు వలయంలో ఉన్నట్లు వస్తున్న వార్తలతో ఉద్దానం మరో మారు ఉలిక్కిపడింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మావోయిస్టు పార్టీ ఏఓబీ కార్యదర్శిగా చెల్లూరి నారాయణ వ్యవహరిస్తున్నారు. 1989లో మా వోయిస్టుగా చేరినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నారాయణరావుపై ప్రభుత్వం రూ. 20 లక్షల రివార్డు సైతం ప్రకటించింది. అయితే కేంద్ర హోంశాఖ అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్‌లో భాగంగా గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఆంధ్రా–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో నారాయణ రావు కేంద్ర బలగాల చేతికి చిక్కినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఇంటెలిజెన్స్, పోలీసులు బాతుపురం వచ్చి గ్రామ పెద్దలు, నారాయణరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి నారాయణరావును సరెండర్ చేయాలని కోరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన మె ట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు నారాయణరావు ఎక్కడ ఎలా ఉన్నాడోననే చర్చ జోరుగా సాగుతోంది.
శ్రీకూర్మనాథాలయ ఈఓగా వాసుదేవరావు
శ్రీకూర్మనాథాలయ ఈఓగా వాసుదేవరావు
శ్రీకూర్మనాథాలయ ఈఓగా వాసుదేవరావు


